Share News

Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Dec 08 , 2025 | 06:14 PM

టీ20 ప్రపంచ కప్‌2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ ను ఐసీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీకి జియో హాట్ స్టార్ షాకిచ్చింది.

Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం
Jio Hotstar exit

వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2026) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. టీ20 వరల్డకప్ 2026కి సంబంధించిన మ్యాచుల షెడ్యూల్‌ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్‌కు ముందు ఐసీసీకి జియోహాట్‌స్టార్ (Jio hotstar) షాక్‌ ఇచ్చింది. టోర్నమెంట్‌ అధికారిక ప్రసారకర్త బాధ్యతల నుంచి వైదొలగుతామని ఐసీసీకి తెలిపినట్లు సమాచారం. అంతేకాక నాలుగేళ్లలో భారత మీడియా హక్కుల ఒప్పందంలోని మిగిలిన రెండేళ్ల కాంట్రాక్ట్‌ను కూడా కొనసాగించలేమని తెలియజేసినట్లు వార్తలొస్తున్నాయి. జియో హాట్‌స్టార్ ఉన్న పళంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌కు వస్తున్న భారీ ఆర్థిక నష్టాలే కారణమని పలువురు మార్కె్ట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


ఇది ఇలా ఉంటే 2026-29 మధ్య కాలానికి భారత మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను ఐసీసీ తాజాగా ప్రారంభించింది. ఈ హక్కుల విలువ దాదాపు 2.4 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. మరోవైపు, జియోహాట్‌స్టార్ 2024-27 మధ్య కాలానికి 3 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జియో హాట్‌స్టార్‌(Jio Hotstar exit) ప్రసార హక్కుల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. జియో హాట్ స్టార్ నిర్ణయంతో వరల్డ్ కప్ ప్రసార హక్కులకు సంబంధించి బిడ్‌లు వేయాలని పలు ప్రధాన ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు ఐసీసీ ఆహ్వానాలు పంపిందని సమాచారం. సోనీ పిక్చర్స్(Sony Pictures) నెట్‌వర్క్ ఇండియా, నెట్‌ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సంస్థలను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ, ఒప్పందం విలువ అధికంగా ఉండటంతో ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదని టాక్. అయితే టోర్నీ ప్రారంభానికి మరో రెండు నెలలు సమయం ఉంది కాబట్టి.. ఏదో ఒక ఓటీటీ సంస్థ ప్రసార హక్కులు పొందే అవకాశం ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

India T20 Squad: స్టార్‌ ప్లేయర్‌పై వేటు... టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే?

87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!

Updated Date - Dec 08 , 2025 | 07:30 PM