India T20 Squad: స్టార్ ప్లేయర్‌పై వేటు... టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే?
ABN , Publish Date - Dec 08 , 2025 | 02:39 PM
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే టీ 20 సిరీస్ ను చేజిక్కించుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడే భారత తుది జట్టుపై పలు వార్తలు వస్తున్నాయి. ఓ స్టార్ ప్లేయర్ పై వేటు పడినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. మరో ఆసక్తికర సిరీస్‌కు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్(South Africa T20 series)లో భాగం రేపు(డిసెంబర్ 9న) కటక్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారింది. టీ20ల్లో వరుస విజయాలతో జోరు మీదున్న భార్.. అదే దూకుడు కనబర్చాలని భావిస్తుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు షాకివ్వాలని ప్రొటీస్ జట్టు పట్టుదలతో ఉంది. దీంతో ఈ తొలి టీ20 మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తొలి మ్యాచ్ కోసం సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు(India T20 squad)పై పలు వార్తలు వస్తున్నాయి. ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం తొలి టీ20 కోసం బారాబాతి స్టేడియంలోని పిచ్‌ను ఎర్రమట్టితో తయారు చేసినట్లు సమాచారం. దీంతో ఈ వికెట్ స్పిన్నర్ల కంటే పేసర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశముంది. దీంతో భారత్ ఇద్దరు స్పిన్నర్లతో మాత్రమే బరిలోకి దిగే అవకాశముంది.
గిల్, హార్దిక్ పాండ్యా రీఎంట్రీ..
గాయాలతో భారత జట్టుకు దూరమైన టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill return), స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరి రాకతో టీమిండియా బలం పెరిగింది. మరోవైపు గత కొన్ని మ్యాచ్‌లగా మూడో స్పిన్నర్‌గా ఉన్న వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేకి చోటు దక్కనున్నట్లు టాక్. ఇక సీమర్లగా అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా దాదాపు ఉంటారు. ఒకవేళ అవసరమైతో దూబే(Shivam Dube)తో బౌలింగ్ చేయిస్తారు లేదా స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఉపయోగించుకుంటారు.
ఇదే సమయంలోస్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం. ఒకవేళ అర్ష్‌దీప్ సింగ్(Arshadeep Singh)ను ఆడించాలనుకుంటే టీమిండియా స్టార్ ప్లేయర్ కుల్దీప్ యాదవ్‌పై వేటు పడుతుంది. ఇక వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను ఆడించనున్నట్లు బీసీసీఐ(BCCI) వర్గాలు వెల్లడించాయి. ఒకట్రెండు మ్యాచ్‌లలో శాంసన్ విఫలమైతే.. జితీశ్ శర్మ వైపు టీమ్ మెనెజ్మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది.
భారత్ తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ/సంజూ శాంసన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్/అర్ష్‌దీప్ సింగ్
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రతీకా రావల్‌కు రూ.1.5కోట్ల రివార్డు
87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!