Virat Kohli: బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీ.. దేనికంటే?
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:32 PM
పూమాతో ఒప్పందం రద్దు చేసుకున్న విరాట్ కోహ్లీ కొత్తగా అజిలిటాస్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. గతంలోనే రూ.40 కోట్లు పెట్టుబడి పెట్టిన కోహ్లీ, వన్8 ఉత్పత్తులను అజిలిటాస్ ద్వారా మార్కెట్‌లోకి తీసుకురానున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూమాతో సుదీర్ఘకాలంగా ఉన్న ఒప్పందాన్ని ఈ ఏడాది ప్రారంభంలో రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విరాట్(Virat Kohli) ఓ కొత్త సంస్థకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. అదే స్పోర్ట్స్‌వేర్ సంస్థ ‘అజిలిటాస్’(Agilitas). ఈ విషయాన్ని సోమవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించాడు. కోహ్లీ 2017లో పూమాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అలాగే సొంతంగా వన్8 అనే కంపెనీని కూడా ప్రారంభించాడు. ఇది స్పోర్ట్స్‌వేర్, ఫుట్‌వేర్, దుస్తులు వంటి విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.
అజిలిటాస్ కోసమే...
అజిలిటాస్‌ను అభిషేక్ గంగూలీ ప్రారంభించాడు. అతడు గతంలో పూమా ఇండియా, సౌత్‌ఈస్ట్ ఆసియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశాడు. అజిలిటాస్ కోసం పూమా ఆఫర్ చేసిన రూ.300కోట్ల ఒప్పందాన్ని విరాట్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ‘అజిలిటాస్ ఆఫర్ వచ్చినప్పుడు.. దాని తయారీ సామర్థ్యాలు, తనకున్న నైపుణ్యం, దీనిలోకి వచ్చే వ్యక్తులు ఎలాంటి వారో నాకు అభిషేక్ గంగూలీ అర్థమయ్యేలా చెప్పారు. ఇది పెద్ద విషయంగా మారవచ్చని అనుకున్నాను. నేను కూడా ఇందులో భాగం కావాలని కోరుకున్నాను. దీన్ని మన సొంత వ్యక్తులు రూపొందించారు’ అని విరాట్ వివరించాడు.
గతంలోనే పెట్టుబడులు..
విరాట్ గతంలోనే అజిలిటాస్‌లో రూ.40కోట్ల పెట్టుబడులు పెట్టారు. నూతన ఒప్పందం ప్రకారం.. కోహ్లీ సొంత కంపెనీ వన్8 ఉత్పత్తులు అజిలిటాస్ ద్వారా మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. కాగా వన్8ను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రతీకా రావల్‌కు రూ.1.5కోట్ల రివార్డు
87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!