IndiGo shares fall: ఇండిగో షేర్లు ఢమాల్.. భారీగా విలువ కోల్పోతున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్..
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:39 PM
గత కొన్ని రోజుల్లో ఇండిగోకు చెందిన వందల కొద్దీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. డీజీసీఏ నూతన ఎఫ్‌డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా సిద్ధం కావడంలో ఇండిగో వైఫల్యం చెందడంతో ఆ సంస్థ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆ ప్రభావం ఆ కంపెనీ షేర్లపై కూడా స్పష్టంగా కనబడుతోంది
కొన్ని రోజులుగా ఇండిగో సంస్థ నడిపే విమానాలు రద్దు కావడం దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది. గత కొన్ని రోజుల్లో ఇండిగోకు చెందిన వందల కొద్దీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. డీజీసీఏ నూతన ఎఫ్‌డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా సిద్ధం కావడంలో ఇండిగో వైఫల్యం చెందడంతో ఆ సంస్థ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆ ప్రభావం ఆ కంపెనీ షేర్లపై కూడా స్పష్టంగా కనబడుతోంది (IndiGo flight disruptions).
ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్లు స్టాక్ మార్కెట్‌లో భారీగా పతనమవుతున్నాయి. గత ఐదు సెషన్లలో ఇండిగో సంస్థ షేర్లు 9 శాతానికి పైగా పతనమయ్యాయి. సోమవారం ఉదయం ఏకంగా 7 శాతానికి పైగా పడిపోయాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సంస్థ షేర్లు 7.68 శాతం నష్టంలో ఉన్నాయి. దీంతో ఆ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు (DGCA notice IndiGo).
సోమవారం నుంచి ఇండిగో కార్యకలపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి (airline planning lapses). సోమవారం ఇండిగో సంస్థ 1, 650 విమాన సర్వీసులను అందిస్తోంది. కాగా, గత కొన్ని రోజుల్లో రద్దైన, తీవ్రంగా ఆలస్యమైన విమానాలకు సంబంధించి రిఫండ్ల రూపంలో రూ.610 కోట్లను ఇండిగో విడుదల చేసింది. అలాగే మూడు వేల బ్యాగేజీలను కూడా ప్రయాణికులకు అప్పగించిందని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!
మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్
For More TG News And Telugu News