Share News

GHMC: జీఎంహెచ్ఎంసీ వార్డుల సంఖ్య పెంపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Dec 09 , 2025 | 09:27 AM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

GHMC: జీఎంహెచ్ఎంసీ వార్డుల సంఖ్య పెంపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Telangana government

హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ(GHMC) వార్డులను 300కు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 వార్డులు ఉండగా.. 300కు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇటీవలే నగర పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ వార్డు రీఆర్గనైజేషన్ స్టడీ రిపోర్డు ఆధారంగా ప్రభుత్వం వార్డుల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 27 అర్బన్ లోకల్ బాడీల డేటాను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను కమిషనర్ సమర్పించారు.


ఈ అధ్యయనం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో పెరిగిన జనాభా, పట్టణ విస్తరణను పరిగణనలోకి తీసుకుని జీహెచ్ఎంసీ చట్టం 1955(సెక్షన్ 8, సెక్షన్ 5) నిబంధనల ప్రకారం కొత్త వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. ముద్రణ శాఖకు 500 ప్రతులను అందించాలని కూడా సూచించారు. జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన, భవిష్యత్తులో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలకు కీలకంగా మారనుంది. గెజిట్ విడుదల అయిన తర్వాత వారం పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వనుంది. ఆ తర్వాత మార్పులు, చేర్పులు చేసి నోటిఫికేషన్ ఫైనల్ చేయనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 09 , 2025 | 09:27 AM