Donald Trump: కార్పొరేట్ సంస్థలు విదేశీ వర్కర్లను అమెరికాకు తీసుకురావచ్చు: ట్రంప్
ABN, Publish Date - Sep 15 , 2025 | 02:18 PM
దక్షిణ కొరియా హెచ్చరికలతో ట్రంప్ వెనక్కు తగ్గారు. అమెరికాలో విదేశీ వర్కర్లకు జాబ్స్ ఇవ్వొచ్చంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. విదేశీ వర్కర్ల నుంచి అమెరికన్లు నేర్చుకునేది ఎంతో ఉందని కూడా అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాంటూ చెబుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెనక్కు తగ్గారు. విదేశీ ఉద్యోగులను కూడా నియమించుకోవచ్చని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఇది అమెరికన్లకు ఉపకరిస్తుందని కూడా అన్నారు. అమెరికాలో పెట్టుబడులపై దక్షిణ కొరియా వార్నింగ్‌తో వెనక్కు తగ్గిన ట్రంప్ చేతుల కాలక ముందే రూటు మార్చి దిద్దుబాటు చర్యలకు దిగారు (Trump foreign workers welcome).
అసలేం జరిగిందంటే..
వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను గుర్తించేందుకు రెయిడ్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జార్జియా రాష్ట్రంలోని హ్యుందాయ్ ప్లాంట్‌లో సుమారు 475 మంది అక్రమ వలసదారులు హ్యూమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులకు చిక్కారు. ప్లాంట్‌లో దక్షిణ కొరియాకు చెందిన వారు అక్రమంగా పని చేస్తున్నారన్న సమాచారంతో వెళ్లిన అధికారులు అనేక మంది దక్షిణ కొరియన్లను అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి (South Korea investment warning).
దక్షిణ కొరియా అసంతృప్తి
ఈ ఉదంతంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు నేరుగా స్పందించారు. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మా వ్యాపార సంస్థలు యూఎస్‌లో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నాయి’ అంటూ తేల్చి చెప్పారు (Hyundai raid fallout). సాంకేతికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న దక్షిణ కొరియా ఇలా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో ట్రంప్ వెంటనే వెనక్కు తగ్గారు. విదేశీ సంస్థలు ఇతర దేశాల వర్కర్లను అమెరికాకు తెచ్చుకోవచ్చని అన్నారు.
‘విదేశీ కంపెనీలు భారీ పెట్టుబడులతో అమెరికాలో పెద్ద ప్లాంట్లు, యంత్రాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇతరత్రా కొన్ని అమెరికా బాటపడతాయి. విదేశీ కంపెనీలు ఇలా ఫారిన్ వర్కర్లను కూడా అమెరికాకు తెచ్చుకోవచ్చు. లేకపోతే.. అమెరికాలోని భారీ స్థాయిలో పెట్టుబడులు రావు. చిప్స్, సెమీ కండక్టర్స్, కంప్యూటర్స్, షిప్పులు, రైళ్లు, ఇలా అనేక రంగాల్లో తయారీకి సంబంధించి ఇతరుల నుంచి అమెరికన్లు మెళకువలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంత కాలం పాటు ఫారిన్ సంస్థలు విదేశీ వర్కర్లను అమెరికాలో నియమించుకోవచ్చు’ అని ముక్తాయించారు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో మా బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి: రష్యా విదేశాంగ శాఖ
100 శాతం సుంకం తప్పదంటూ ట్రంప్ హెచ్చరికలు.. స్పందించిన చైనా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం
Updated Date - Sep 15 , 2025 | 02:23 PM