Donald Trump: అమెరికా సీక్రెట్ సర్వీస్‌లో 13 ఏళ్ల బాలుడు.. ట్రంప్ ఆ పిల్లాడిని ఎందుకు నియమించారు..
ABN, Publish Date - Mar 05 , 2025 | 11:44 AM
Donald Trump Teen Secret Agent : అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ సందర్భంగా.. సమావేశంలో ప్రసంగించే సమయంలో ఒక అనూహ్య ప్రకటన చేశారు. 13 ఏళ్ల కుర్రాడిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమిస్తున్నానని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడే టీనేజ్‌లో అడుగుపెట్టిన చిన్న కుర్రాడికి ఇంత పెద్ద పదవి ఎందుకిచ్చారంటే..
Donald Trump Teen Secret Agent : అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ సందర్భంగా.. సమావేశంలో ప్రసంగించే సమయంలో ఒక అనూహ్య ప్రకటన చేశారు. 13 ఏళ్ల కుర్రాడిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ (United States Secret Service) ఏజెంట్‌గా నియమిస్తున్నానని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడే టీనేజ్‌లో అడుగుపెట్టిన చిన్న కుర్రాడికి ఇంత పెద్ద పదవి ఎందుకిచ్చారంటే..
13 ఏళ్ల డీజే ఎవరంటే.. ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి తన మొదటి సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తున్న సమయంలో 13 ఏళ్ల కుర్రాడు డీజే డేనియల్‌ను యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా ప్రకటించి దేశప్రజలను అబ్బురపరిచారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనకగల కారణం గురించి మాట్లాడుతూ ' టెక్సాస్‌కు చెందిన 13 ఏళ్ల డీజే డేనియల్ ఇప్పుడు గ్యాలరీలో మన మధ్యే ఉన్నాడు. 2018 లో తనకు అరుదైన క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేవలం ఐదు నెలలే జీవించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. అయినా, ధైర్యంగా అన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడు. పోలీస్ అధికారి కావాలనే తన కల కోసం విధికి తలొంచకుండా డీజే పోరాడాడు. అందుకే ఇప్పుడు మేం మీకు గొప్ప గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మిమ్మల్ని అధికారికంగా యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమించమని మా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కరన్‌ను నేను కోరుతున్నా' అని మాట్లాడారు.
ట్రంప్ నిర్ణయాన్ని వెల్లడించగానే సభికుల చప్పట్లతో సభంతా మార్మోగిపోయింది. రిపబ్లికన్ పార్టీ సభ్యులతో పాటు డెమెక్రటిక్ పార్టీ సభ్యులు ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సభలో హర్షధ్వానాలు చేశారు. డేనియల్ తండ్రి భావోద్వేగాన్ని ఆపుకోలేక డీజేని గాల్లోకి ఎత్తగా, హౌస్ గ్యాలరీలోని సభ్యులంతా డీజే! డీజే!" అని నినాదాలు చేశారు. ఆ తర్వాత సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కరన్ డేనియల్ దగ్గరికి వచ్చి, అతడికి అధికారిక బ్యాడ్జ్ ఇచ్చాడు. వెంటనే సంతోషంతో కరన్‌ను కౌగిలించుకున్నాడు డీజే. అధ్యక్షుడికి తన కృతజ్ఞతలు తెలిపాడు.
Read also : Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎవ్వర్నీ వదిలేలా లేరుగా..
China Retaliatory Tariffs on USA: డొనాల్డ్ ట్రంప్‌కు షాక్.. అమెరికా దిగుమతులపై చైనా సుంకాల విధింపు
Donald Trump: ఉక్రెయిన్‌కు సైనికసాయం బంద్
Updated Date - Mar 05 , 2025 | 06:24 PM