ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump on migrants: మురికిగా, అసహ్యంగా ఉండే జనాన్నే తెచ్చుకున్నాం: ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యలు..

ABN, Publish Date - Dec 11 , 2025 | 07:45 AM

తాము వలసలను భారీగా తగ్గించామని, అందువల్లే గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అమెరికన్లకు ఎక్కువ ఉద్యోగావకాశాలు, మంచి వేతనాలు దక్కుతున్నాయని అన్నారు. పెన్సిల్వేనియాలోని మౌంట్ పొకానోలో మంగళవారం జరిగిన సభలో ట్రంప్ ప్రసంగించారు.

Trump racist slur controversy

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వలసల గురించి మాట్లాడే క్రమంలో ఆఫ్రికా దేశాల పౌరుల గురించి జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. తాము వలసలను భారీగా తగ్గించామని, అందువల్లే గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అమెరికన్లకు ఎక్కువ ఉద్యోగావకాశాలు, మంచి వేతనాలు దక్కుతున్నాయని అన్నారు. పెన్సిల్వేనియాలోని మౌంట్ పొకానోలో మంగళవారం జరిగిన సభలో ట్రంప్ ప్రసంగించారు (Trump offensive remarks).

'నార్వే, స్వీడన్, డెన్మార్క్ దేశాల నుంచి అమెరికాకు ఎందుకు వలసలు లేవు. ఆ దేశానికి చెందిన వారిని మనం ఎందుకు ఆకర్షించలేకపోయాం. మనం ఎప్పుడూ సోమాలియా లాంటి దేశాల వారికే ఆశ్రయమిస్తున్నాం. మురికిగా, అసహ్యంగా, నేరాలతో నిండిపోయిన వారినే అంగీకరిస్తున్నాం. వారి నైపుణ్యం కేవలం ఓడలను వెంటాడడమే. తొలిసారిగా రివర్స్ మైగ్రేషన్ జరుగుతోంది. అఫ్గానిస్థాన్, హైతీ, సోమాలియా తదితర దేశాల నుంచి వచ్చే జనాలను అడ్డుకుంటున్నాం' అని ట్రంప్ వెల్లడించారు (Trump backlash African migrants).

ఇక, భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన అణు యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ 70వ సారి పునరుద్ఘాటించారు (political outrage Trump). 10 నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపానని, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లలో శాంతిని స్థాపించానని అన్నారు. అలాగే అణ్వస్త్ర దేశాలైన భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని, కొసావో-సెర్బియా యుద్ధాన్ని అడ్డుకున్నానని చెప్పారు. థాయ్‌లాండ్-కంబోడియా యుద్ధ రంగంలోకి దిగకుండా అడ్డుకున్నానని కూడా చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఏఐ రేసులో వినియోగ దేశాలే విజేతలు

ఊబకాయానికి సిప్లా ఔషధం

Updated Date - Dec 11 , 2025 | 07:45 AM