Satya Nadella AI Race: ఏఐ రేసులో వినియోగ దేశాలే విజేతలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 06:27 AM
ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) రేసులో సాంకేతికతను సృష్టించే దేశాల కంటే దాని వినియోగంలో ముందుండే దేశాలే విజేతలవుతాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు...
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
న్యూఢిల్లీ: ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) రేసులో సాంకేతికతను సృష్టించే దేశాల కంటే దాని వినియోగంలో ముందుండే దేశాలే విజేతలవుతాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. ‘‘ఆధునిక టెక్నాలజీని ఆవిష్కరించిన దేశాలు, కంపెనీలు, సమాజాలకు బదులు దాన్ని వేగంగా స్వీకరించి తరువాత తరం ఆవిష్కరణలు చేపట్టిన దేశాలే విజయం సాఽధించాయని గత సాంకేతికత విప్లవాలను అధ్యయనం చేసిన వారు గుర్తించారు’’ అని నీతి ఆయోగ్‌కు చెందిన దేవయానీ ఘోష్‌తో జరిగిన ఫైర్‌సైడ్ చాట్‌లో పేర్కొన్నారు. భారత్ కీలకమైన దశలో ఉందని.. ఏఐ టెక్నాలజీ వేగవంత వినియోగం ప్రజలతో పాటు సంస్థలకు గణనీయ ఫలితాలు అందించగలదన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్ 5.75 కోట్ల డెవలపర్లతో ప్రపంచంలో అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా అవతరించనుందని నాదెళ్ల అన్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధం చివరికల్లా హైదరాబాద్‌లోనూ క్లౌడ్ రీజియన్‌ను ఏర్పా టు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా కేంద్ర కార్మిక శాఖ బుధవారం మైక్రోసా్‌ఫ్టలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
Read Latest Telangana News and National News