ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 25 , 2025 | 10:02 AM

అమెరికా నిర్వహించిన వైమానిక దాడులు ఇరాన్‌పై తీవ్ర ప్రభావం చూపాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. కానీ, ఈ దాడులు ఇరాన్ న్యూక్లియర్ సౌకర్యాలను పూర్తిగా ధ్వంసం చేయలేదని ఓ నివేదిక షాకింగ్ విషయాలను ప్రకటించింది.

Donald Trump

ఇరాన్‌పై జరిగిన అమెరికా (America) వైమానిక దాడులు ఆ దేశ న్యూక్లియర్ సౌకర్యాలను పూర్తిగా ధ్వంసం చేశాయని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెబుతున్నారు. కానీ పలు మీడియా నివేదికల నేపథ్యంలో ఇరాన్.. న్యూక్లియర్ కార్యక్రమాన్ని కొన్ని నెలలు మాత్రమే వాయిదా వేశాయని చెబుతున్నాయి. ఈ నివేదికలను ట్రంప్ నకిలీ వార్తలని తోసిపుచ్చారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. ఈ వార్తలు ప్రచురించే సీఎన్‌ఎన్, న్యూయార్క్ టైమ్స్‌లు కలిసి ఈ చారిత్రక విజయవంతమైన సైనిక దాడిని చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇరాన్‌లోని న్యూక్లియర్ సౌకర్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ మీడియా సంస్థలు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయని ట్రంప్ తెలిపారు.

నివేదిక ఏం చెబుతోంది?

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా ఈ నివేదికలను పూర్తిగా తప్పు అని తిరస్కరించారు. ఈ నివేదికలు ట్రంప్‌ను అవమానించేందుకు చేసిన ప్రయత్నమని ఆమె అన్నారు. 14 లక్షల కిలోల బాంబులను ఖచ్చితంగా లక్ష్యంపై వేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసని అన్నారు. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) నివేదిక ప్రకారం, జూన్ 22న అమెరికా ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్ కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై దాడులు జరిపింది. అయితే ఈ దాడుల్లో ఇరాన్ న్యూక్లియర్ ప్రధాన భాగాలను ధ్వంసం కాలేదని , కేవలం కొన్ని నెలల తర్వాత వాయిదా వేశారని ఈ నివేదిక చెబుతోంది. ఈ సౌకర్యాలకు నష్టం జరిగినప్పటికీ, ఇరాన్ న్యూక్లియర్ మౌలిక సౌకర్యాలు చాలా వరకు సురక్షితంగా ఉన్నాయని తెలుస్తోంది.

వాస్తవం ఏంటి

ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడులు పూర్తి విజయవంతమయ్యాయని చెప్పినప్పటికీ, డిఐఏ నివేదిక వారి వాదనలను ఖండిస్తోంది. ఈ దాడులు ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని గణనీయంగా దెబ్బతీసినప్పటికీ, దానిని పూర్తిగా నాశనం చేయలేకపోయాయని నివేదిక స్పష్టం చేస్తోంది. ఇది అమెరికా, ఇజ్రాయెల్ నాయకుల వాదనలకు విరుద్ధంగా ఉంది. ఈ వివాదం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి:

జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా..


ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 02:53 PM