ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

ABN, Publish Date - May 24 , 2025 | 03:58 PM

పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఊచకోత కోసిన ఉగ్రదాడిని అభిషేక్ బెనర్జీ ప్రస్తావిస్తూ, దీని వెనుక ఉన్న రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) అనేది ఉందని, అది పాక్ ఉగ్రవాద లష్కరే తొయిబా సంస్థకు చెందనిదని, ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని చెప్పారు.

టోక్యో: ఉగ్రవాదాన్ని కోపంతో ఉన్న కుక్క (Rabid dog)గా, పాకిస్తాన్‌ను దానికి బాధ్యుడైన అతి నీచమైన నిర్వాహకుడుగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhisekh Banerjee) అభివర్ణించారు. ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా తలవంచదనే సత్యాన్ని అందరికీ తెలియజెప్పేందుకు తాము ఇక్కడకు వచ్చామని అన్నారు. పాక్ ఉగ్రవాదానికి, సరిహద్దుల్లో తలెత్తుతున్న ముప్పను ప్రపంచ వేదికలపై ఎండగట్టేందుకు విదేశాల్లో అఖిలపక్ష ఎంపీ బృందాలు పర్యటిస్తున్నాయి. ఇందులో భాగంగా జేడీయు ఎంపీ సంజయ్ ఝా ఆధ్వర్యంలోని భారత అఖిలపక్ష పార్లమెంటరీ బృందం జపాన్‌ను శనివారంనాడు సందర్శించింది. అక్కడి భారత సంతతి ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంది.

Gujarat ATS: పాక్‌కు భారత రక్షణ రహస్యాలు చేరవేత.. అరెస్ట్


''ఉగ్రవాదానికి భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలొంచేది లేదు. ఈ విషయంలో మాకెలాంటి భయం లేదు. నేను విపక్షంలో ఉంటున్న పార్టీకి చెందిన వాడిని. అయినా పబ్లిక్ డొమైన్‌లో చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నాను. పాకిస్తాన్‌కు వారికి తెలిసిన భాషలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదం అనేది రాబిడ్ డాగ్ అయితే, దాని నీచమైన నిర్వాహకుడుగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. దీన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాలంటే యావత్ ప్రపంచం ఐక్యంగా నిలబడాలి'' అని అభిషేక్ బెనర్జీ అన్నారు. ఈ విషయంలో ఇండియా బాధ్యతగా వ్యవహరిస్తుందని, ఇండియా తీసుకునే ప్రతిచర్య కచ్చితత్వంలో, బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్పారు.


జమ్మూకశ్మీర్‌ లోని పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఊచకోత కోసిన ఉగ్రదాడిని అభిషేక్ బెనర్జీ ప్రస్తావిస్తూ, దీని వెనుక ఉన్న రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఎవరో కాదని, అది పాక్ ఉగ్రవాద లష్కరే తొయిబా సంస్థకు చెందినదని, లష్కరేను ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని చెప్పారు. లష్కరేను ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించేందుకు పాక్ ఎంతగా తహతహలాడుతోందో అందరికీ తెలిందేనని అన్నారు. భారత్ మెరుపుదాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ సీనియర్ అధికారులు పాల్గొన్నట్టు అనేక ఫోటోలు ప్రచారంలోకి వచ్చాయని చెప్పారు. భారత ప్రజలు ఎక్కడ నివసిస్తున్నా అంతర్జాతీయ ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి అండగా నిలబడాలని, ఒకే వాణి వినిపించాలని అభిషేక్ పిలుపునిచ్చారు.


ఇవి కూాడా చదవండి..

Covid 19 Cases in India: ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు.. ఆసుపత్రుల్లో హైఅలర్ట్

Rains: రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు

Karnataka: జైలు నుంచి విడుదలయ్యాక ఊరేగింపు.. కర్ణాటక అత్యాచార నిందితుల అరెస్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 24 , 2025 | 04:02 PM