Home » TMC
ఈసారి ఫిరాయింపుదారులను పార్టీలోకి చేర్చుకునే ఆలోచన బీజేపీకి అంతగా లేదని అంటున్నారు. బెంగాల్లో తమ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని బీజేపీ భావిస్తుండటమే ఇందుకు కారణం.
కల్యాణ్ బెనర్జీ అసాంసోల్ (దక్షిణ్) ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2001-2006 మధ్య ఎస్బీఐలో ఖాతా తెరిచారు. అయితే చాలా ఏళ్లుగా ఈ అకౌంట్ యాక్టివ్‌గా లేదు. 2025 అక్టోబర్ 28న సైబర్ మోసగాళ్లు ఆయన అకౌంట్‌కు అనుసంధానించిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను మార్చారు.
ఎమ్మెల్యే సార్‌ని కలిసి ఉద్యోగం ఇప్పించమని కోరతానని ఇంట్లోకి వెళ్లాడు. ఎమ్మెల్యేకి దూరం నుంచి నమస్కారం పెట్టి, దగ్గరకి వెళ్లాడోలేదో.. అదే పనిగా ఎమ్మెల్యే పొట్ట మీద పిడిగుద్దులు కురిపించాడు. రెప్పపాటులో అదేపనిగా ఎక్కడ దొరికితే అక్కడ శరీరాన్ని కుళ్ళబొడిచేశాడు.
సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు వెళ్తున్న తమ పార్టీ ప్రతినిధి బృందంపై దాడి వెనుక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు.
బెంగాల్ మాట్లాడే వలస కార్మికులపై ఇతర రాష్ట్రాలలో దాడులు జరుగుతున్నాయంటూ శనివారంనాడు మాల్డాలో టీఎంసీ నిరసన ర్యాలీ జరిపింది. ఇందులో అబ్దుర్ రహీమ్ బక్షి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇంటరాగేషన్ నుంచి తప్పించుకునే సమయంలో జిబాన్ సహా తన మొబైల్‌ను మురుగు కాలువలోకి విసిరేయడంతో దానిని ఈడీ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించి తాజాగా ఈడీ రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టింది.
పార్లమెంటులో ప్రతిపాదిత బిల్లును మోదీ సమర్ధిస్తూ, నేరచరిత్ర ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందని, జైలు నుంచి ఆదేశాలు ఇవ్వడం కుదరదని అన్నారు.
కల్యాణ్ బెనర్జీ, కృష్ణానగర్ ఎంపీ మహువా మొయిత్రా మధ్య కొద్దికాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. దీనికి ముందు టీఎంసీ ఎంపీ కీర్తి అజాద్‌తోనూ మహువా మొయిత్రా గొడవపడ్డారు.
మదన్ మిత్రా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురికావడంతో టీఎంసీ దీనిపై సామాజిక మాధ్యమంలో స్పందించింది. వ్యక్తిగత హోదాలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు పార్టీ అభిపాయం కాదని వివరణ ఇచ్చింది. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.
లా విద్యార్థిని అత్యాచార ఘటనపై కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన మహువా మెయిత్రా.. ఆయనొక 'స్త్రీ ద్వేషి' అంటూ ఘాటుగా విరుచుకుపడ్డారు. దీనిపై కల్యాణ బెనర్జీ కన్నెర్ర చేశారు.