SpaceX Crew 10: మరికొన్ని రోజుల్లో భూమిపైకి సునీతా విలియమ్స్..స్పేస్ఎక్స్ డాకింగ్ సక్సెస్..
ABN, Publish Date - Mar 16 , 2025 | 12:59 PM
సునీతా విలియమ్స్ బృందం కోసం అంతరిక్షానికి చేరుకున్న స్పేస్ఎక్స్ క్రూ 10 డాకింగ్ విజయవంతమైనట్లు ప్రకటించారు. ఈ క్రమంలో వారు భూమిపైకి వచ్చేందుకు ఇంకా ఎన్ని రోజుల టైం పడతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్(Sunita Williams) బృందాన్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ అరుదైన ఘనతను సాధించింది. మార్చి 14న ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన క్రూ 10 అంతరిక్ష యాత్రికుల బృందం, మార్చి 16 తెల్లవారుజామున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) విజయవంతంగా చేరుకుంది. ఈ క్రమంలో వారి ప్రయాణం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించబడుతోంది. దీంతో వీరు మరిన్ని కీలక చర్యలు చేపట్టనున్నారు.
ISSలో మార్పులు
ప్రస్తుతం ISSలో ఉన్న NASA వ్యోమగాములు నిక్ హేగ్, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, రోస్కోస్మోస్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ల నుంచి క్రూ-10 బృందం బాధ్యతలు స్వీకరించనుంది. క్రూ9 సభ్యులు గత కొంతకాలంగా ISSలో ఉన్నారు. వీరిలో హేగ్, గోర్బునోవ్ సెప్టెంబర్‌లో క్రూ9లో భాగంగా ISS చేరగా, సునీతా విలియమ్స్, విల్మోర్ గత జూన్ నుంచి ISSలో ఉన్నారు. సునీతా విలియమ్స్ ప్రత్యేకంగా బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్‌లో భాగంగా ISSలో ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే థ్రస్టర్ సమస్యల కారణంగా ఆ మిషన్ ఆలస్యం కావడంతో, ఆమె మరికొంత కాలం ISSలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు వారంతా క్రూ10 ద్వారా తిరిగి భూమిపైకి చేరుకుంటారు.
భూమికి తిరిగిరానున్న బృందం
NASA ప్రకారం క్రూ-9 బృందం స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా మార్చి 19 కంటే ముందుగా భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వారు సురక్షితంగా తిరిగి వచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు.
డాకింగ్ విజయవంతం
స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ "ఎండ్యూరెన్స్", ISS హార్మోనీ మాడ్యూల్‌కు అనుసంధానించబడింది. 418 కిలోమీటర్ల ఎత్తున అట్లాంటిక్ మహాసముద్రంపై ఇది చోటుచేసుకుంది. ఇది అంతరిక్ష పరిశోధనలో మరొక కీలక మైలురాయని నిపుణులు అంటున్నారు. ఈ విజయంతో అంతరిక్ష పరిశోధనలో మరిన్ని విజయాలు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
క్రూ-10 విజయవంతమైన ప్రయాణం
ఈ సారి ISSకి చేరిన బృందంలో నాసా వ్యోమగాములు అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA)కి చెందిన టకుయా ఒనిషి, రోస్కోస్మోస్ కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. మెక్‌క్లెయిన్ మిషన్ కమాండర్‌గా, అయర్స్ పైలట్‌గా, ఒనిషి, పెస్కోవ్ మిషన్ నిపుణులుగా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. ఈ బృందం మరికొన్ని రోజులు ISSలో గడిపే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
US Strikes: నరకం చూపిస్తా.. హౌతీలకు ట్రంప్ వార్నింగ్
Terrorist Killed: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సన్నిహితుడు హతం
Delhi Air Quality: రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్.. మూడేళ్లలో కొత్త రికార్డు!
Gold Silver Rates Today: తగ్గిన గోల్డ్, భారీగా పెరిగిన వెండి.. ఎంతకు చేరుకున్నాయంటే..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News
Updated Date - Mar 16 , 2025 | 01:30 PM