Share News

Gold Silver Rates Today: తగ్గిన గోల్డ్, భారీగా పెరిగిన వెండి.. ఎంతకు చేరుకున్నాయంటే..

ABN , Publish Date - Mar 16 , 2025 | 06:36 AM

దేశంలో దాదాపు 90 వేల స్థాయికి చేరుకున్న పసిడి ధరలకు కాస్తా ఉపశమనం లభించింది. ఈ క్రమంలో పసిడి ధర తగ్గిపోగా, వెండి రేటు మాత్రం ఏకంగా ఒక్కరోజులోనే రూ.8900 పెరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Gold Silver Rates Today: తగ్గిన గోల్డ్, భారీగా పెరిగిన వెండి.. ఎంతకు చేరుకున్నాయంటే..
gold and silver rate today hyderabad on march 16th

దేశంలో పసిడి ప్రియులకు కాస్తా ఊరట లభించింది. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ రూ. 89 వేల స్థాయిలోనే ఉన్న పసిడి ధరలను చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు. ఇదే సమయంలో వచ్చిన పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు పెరిగిన ధరల నేపథ్యంలో గతంతో పోల్చితే కొనుగోళ్లు కూడా తగ్గాయని ఆయా వ్యాపార వర్గాలు అంటున్నాయి.


ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈ క్రమంలో మార్చి 16, 2025న గుడ్‎రిటర్న్స్ వెబ్‎సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.89,670కి చేరుకుంది. ఈ రేటు నిన్నటితో పోల్చితే రూ. 120 తగ్గింది. ఇక 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 82,220కి చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,820 స్థాయికి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 82,350కి చేరుకుంది.


దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధలు ఎలా ఉన్నాయంటే (24, 22 క్యారెట్)

  • చెన్నైలో రూ. 89,670, రూ.82,200

  • న్యూఢిల్లీలో రూ. 89,820, రూ.82,350

  • ముంబైలో రూ. 89,670, రూ.82,200

  • కోల్‌కతాలో రూ. 89,670, రూ.82,200

  • బెంగళూరులో రూ. 89,670, రూ.82,200

  • అహ్మదాబాద్లో రూ. 89,720, రూ.82,250

  • విజయవాడలో రూ. 89,670, రూ.82,200

  • పాట్నాలో రూ. 89,720, రూ.82,250

  • లక్నోలో రూ. 89,820, రూ.82,350


వెండి రేట్లు ఇలా..

మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా పుంజుకున్నాయి. చెన్నై, హైదరాబాద్‎లో భారీగా పెరిగి కిలోకు రూ. 1,12,00కి చేరుకున్నాయి. ఈ రేట్లు నిన్నటితో పోల్చితే రూ.8900 పెరగడం విశేషం. ఇదే సమయంలో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 1,03,000కు చేరుకుంది. ఢిల్లీలో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కానీ దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు సహా భారత రూపాయి విలువ తగ్గడం లేదా పెరగడం కూడా వంటి అనేక అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అయితే రూపాయి విలువ పెరిగితే, బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతోపాటు బంగారం సరఫరా పెరిగితే లేదా మైనింగ్ ఉత్పత్తి ఎక్కువ ఉన్నా కూడా ధరలు తగ్గనున్నాయి.


ఇవి కూడా చదవండి:

PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 16 , 2025 | 09:27 AM