Share News

Terrorist Killed: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సన్నిహితుడు హతం

ABN , Publish Date - Mar 16 , 2025 | 10:05 AM

26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‎కు అత్యంత సన్నిహితుడైన ఉగ్రవాది అబూ ఖతల్ హతమయ్యాడు. పాకిస్తాన్‌లో శనివారం రాత్రి జరిగిన దాడిలో మరణించాడు.

Terrorist Killed: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సన్నిహితుడు హతం
Hafiz Saeed Abu Qatal

లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఖతల్ (Abu Qatal) హతమయ్యాడు. ఈ ఉగ్రవాది భారతదేశ భద్రతా సంస్థలకు తలనొప్పిగా మారిన ఒక కీలక సూత్రధారి కావడం విశేషం. అతను జమ్మూ కశ్మీర్‌లో అనేక ఉగ్రదాడులకు ప్రణాళికలు రూపొందించిన కీలక వ్యక్తిగా ఉన్నాడు. దీంతోపాటు 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌కు అతను అత్యంత సన్నిహితుడు. పాకిస్తాన్‌లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అబూ ఖతల్‎ను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.


అనేక దాడుల్లో ప్రమేయం..

జూన్ 9న జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో భక్తులతో వెళ్తున్న బస్సును ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. శివ్ ఖోడి ఆలయం నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సుపై దాడి ఘటనలో అబూ ఖతల్ కీలక పాత్ర పోషించారు. ఈ దాడిలో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోగా, చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. 2023 జనవరి 1న జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని ధంగరి గ్రామంలో జరిగిన ఉగ్రదాడికి కూడా అబూ ఖతల్ నేరుగా సంబంధం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిర్ధారించింది. ఆ దాడిలో పౌరులను టార్గెట్ చేయడంతోపాటు, మరుసటి రోజు జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు చిన్నారులతో సహా ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు.


ఎవరు చేయించారు..

NIA ఛార్జిషీట్ ప్రకారం లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు అగ్రశ్రేణి ఉగ్రవాదులు ఈ దాడికి ప్లాన్ చేశారని అంటున్నారు. కానీ ఏ దాడి ఎవరు చేయించారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇటీవల అమెరికా, ఇరాక్ కలిసి ఓ ఐసిస్ తీవ్రవాదిని మట్టుబెట్టిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతని మరణంతో లష్కరే తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు.


ఎంత కాలం తప్పించుకున్నా..

అబూ ఖతల్ మరణం భారత్‌కి పెద్ద విజయమని చెప్పవచ్చు. భారత భద్రతా సంస్థలు ఎంతో కాలంగా అబూ నిర్వహించే ఉగ్ర కార్యకలాపాలపై నిఘా పెట్టి, అతన్ని అదుపులోకి తీసుకునేందుకు శ్రమించాయి. భారత భద్రతా దళాలకు ముప్పు తెచ్చేలా నేరుగా ఉగ్రవాదులను నియమించుకుని, మైనారిటీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకునే విషయంలో అబూ ఖతల్ కీలక కీలక పాత్ర పోషించాడు. ఉగ్రవాదులు ఎక్కడైనా దాక్కున్నా, ఎంత కాలం పాటు తప్పించుకున్నా, చివరకు న్యాయం వారిని చేరుకుంటుందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసిందని చెప్పవచ్చు.


ఇవి కూడా చదవండి:

Delhi Air Quality: రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్.. మూడేళ్లలో కొత్త రికార్డు!

Gold Silver Rates Today: తగ్గిన గోల్డ్, భారీగా పెరిగిన వెండి.. ఎంతకు చేరుకున్నాయంటే..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 16 , 2025 | 10:31 AM