Trump G20 boycott: అది సామ్రాజ్యవాద ధోరణి.. ట్రంప్‌పై దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆగ్రహం..
ABN, Publish Date - Nov 10 , 2025 | 11:58 AM
దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్న జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనంగా మారింది. అమెరికా తరఫున ఒక్క అధికారి కూడా జీ20 సదస్సుకు హాజరు కాబోరని ట్రంప్ ప్రకటించడంపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం మండిపడింది.
దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్న జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనంగా మారింది. అమెరికా తరఫున ఒక్క అధికారి కూడా జీ20 సదస్సుకు హాజరు కాబోరని ట్రంప్ ప్రకటించడంపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం మండిపడింది. ట్రంప్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన విమర్శలపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం, పాలక పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ANC) ఆగ్రహం వ్యక్తం చేశాయి ( South Africa vs Trump).
'అమెరికా నాయకులు చేసిన ప్రకటనలు పూర్తిగా అవాస్తవాలు. వారిది సామ్రాజ్యవాద జోక్యం. దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష లేదు. వర్ణవివక్ష సృష్టించిన అసమతుల్యతలను పరిష్కరించడానికే దక్షిణాఫ్రికా చట్టాలు పని చేస్తాయి. సామ్రాజ్యవాద సరసాలను మేము సరదాగా తీసుకోము. అమెరికా పాల్గొనకపోయినా సమ్మిట్ కొనసాగుతుంది. ట్రంప్ వాదనలు, కట్టుకథలను మేము తిరస్కరిస్తున్నాము. మా సార్వభౌమాధికారం పట్ల ట్రంప్ యంత్రాంగానికి ఎలాంటి గౌరవమూ లేదు. వారు మమ్మల్ని అమెరికా ఉపదేశం అని భావిస్తున్నారు' అంటూ ఏఎన్‌సీ సెక్రటరీ జనరల్ ఫికిలే ముబాలులా విమర్శించారు (Trump imperialist remark).
దక్షిణాఫ్రికా ప్రభుత్వం శ్వేత జాతి రైతులతో క్రూరంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ట్రంప్ జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు (South Africa Trump statement). నవంబర్ 22-23 తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా ఈ సదస్సు జరగబోతోంది. ఆఫ్రికానెర్ కమ్యూనిటీ (దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతులు)పై హింస, దాడులు, భూములు, పొలాల స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్న వారికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ట్రంప్ ఆరోపించారు. అలాంటి దేశంలో జీ20 సదస్సు జరగడం అవమానకరమని, ఆ సదస్సుకు అమెరికా తరఫు నుంచి ఎవరూ హాజరుకాబోరని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 10 , 2025 | 11:58 AM