Seattle Heist: జస్ట్ 90 సెకన్లలో కోట్ల విలువైన నగలు కొట్టేశారు.. షాకింగ్ వీడియో..
ABN, Publish Date - Aug 16 , 2025 | 06:13 PM
Seattle Jewelry Heist Viral Video: మీరు ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాలు చూసి ఉంటారు.. కానీ, ఇలాంటి తొంగతనం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనే చెప్పాలి. అవును మరి.. క్షణాల వ్యవధిలోనే కోట్లాది విలువైన నగలను ఎత్తుకెళ్లిపోయారు దోపిడిదారులు.
Seattle Jewelry Heist Viral Video: మీరు ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాలు చూసి ఉంటారు.. కానీ, ఇలాంటి తొంగతనం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనే చెప్పాలి. అవును మరి.. క్షణాల వ్యవధిలోనే కోట్లాది విలువైన నగలను ఎత్తుకెళ్లిపోయారు దోపిడిదారులు. ఆ నగల విలువ 2 మిలియన్ డాలర్ల పైనే ఉంటుందని చెబుతున్నారు. అంటే మన కరెన్సీలో చూసుకుంటే 17.53 కోట్లు అనమాట. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ దొంగలు ఎలా దొంగతనం చేశారు.. ఎంత నగలు ఎత్తుకెళ్లారు.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
అమెరికాలోని వెస్ట్ సియాటెల్‌లో మినాషే అండ్ సన్స్ జువెలరీ షాప్ ఉంది. పట్టపగలే మాస్క్ ధరించిన కొందరు దుండగులు మారణాయుధాలతో షాపులోకి చొరబడ్డారు. షాప్ యజమానిని బెదిరించి.. డిస్‌ప్లే గ్లాస్‌లను పగలగొట్టి అందులో ఉన్న బంగారు, వజ్రాభరణాలను తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లలో వేసుకున్నారు. జస్ట్ 90 సెకన్లలోనే షాప్‌ను కొల్లగొట్టేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దోపిడీ వ్యవహారం అంతా జువెలరీ షాప్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
చోరీపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిన నిందితులను పట్టుకునేందుకు అక్కడి పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, షాపులో 2 మిలియన్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు ధృవీకరించారు. అయితే, ఈ చోరీకి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వీడియో చూసి నెటిజన్లు.. సెకన్ల వ్యవధిలోనే షాప్ మొత్తాన్ని కొల్లగొట్టడంపై అవాక్కవుతున్నారు.
Also Read:
Today Top 5 News: టు డే టాప్-5 ఆర్టికల్స్ ఇవే..
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు.. మంత్రి
For More International News and Telugu News..
Updated Date - Aug 16 , 2025 | 06:13 PM