Today Top 5 News: టు డే టాప్-5 ఆర్టికల్స్ ఇవే..
ABN , Publish Date - Aug 16 , 2025 | 06:08 PM
దేశవ్యాప్తంగా ఇవాళ(శనివారం) పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రలింకులు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, సృష్టి కేసు వ్యవహారం, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, భారత్‌కు చైనా విదేశాంగ మంత్రి రాక వంటి అంశాలు నేడు కీలకంగా మారాయి. ఆ వార్తలకు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సత్యసాయి జిల్లా కేంద్రంలో ఉగ్ర కదలికలతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అయితే.. ఇప్పటికే ఉగ్రవాది నూర్ మహమ్మద్ షేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏపీలో ఉగ్ర కదలికలపై నిఘావర్గాలు, ఏపీ పోలీసులు ఫోకస్ పెట్టారు. ధర్మవరంలో నూర్ మహమ్మద్ షేక్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్‌కు పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) గుర్తించింది. భారతదేశంలో నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు చెందిన వాట్సప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు ఐబీ అధికారులు పేర్కొన్నారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కోల్‌కతా: పద్మశ్రీ అవార్డు గ్రహీత, స్విమ్మింగ్ క్వీన్ బులా చౌదరి (Bula Chowdhury) ఇంట్లో దొంగలు పడ్డారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన పలు ప్రతిష్ఠాత్మక పతకాలు, మెమెంటోలు ఎత్తుకెళ్లారు. పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని ఆమె పూర్వీకుల ఇంట్లో ఈ చోరీ జరగడంతో తాను జీవితంలో సంపాదించుకున్న సర్వం కోల్పోయానంటూ బులా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. 'దొంగలు నేను జీవితాంతం కష్టపడి, ఎంతో అంకితభావంతో సాధించిన అన్నింటినీ దోచుకుపోయారు. SAAF గేమ్స్‌లో గెలుచుకున్న ఆరు బంగారు పతకాలతో సహా అన్ని మెడల్స్, పద్మశ్రీ పతకం కూడా ఎత్తుకెళ్లారు' అని చౌదరి తెలిపారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అమరావతి: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని కానుకగా ప్రకటించింది. సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎక్స్ లో చేసిన పోస్టులో ఇలా రాసుకొచ్చారు. ఉచిత బస్సు టికెట్ అనేది నమ్మకానికి నిదర్శనం... స్వేచ్చకు, గౌరవానికి ప్రతీక. ఇది ప్రయాణం కాదు ఓ కదలిక, స్వేచ్చాయుత, సమాన అవకాశం. స్త్రీ శక్తి ద్వారా ఏపీ ప్రభుత్వం మహిళల సాధికారితకు పట్టంకట్టింది. సోదరసోదరీమణులారా...ఈ ప్రయాణాన్ని వేడుకగా నిర్వహించుకుందాం. మీ ఫ్రీ బస్సు టికెట్ తో సెల్ఫీ దిగి ఈ ప్రపంచానికి సాధికారిత అంటే ఎలా ఉంటుందో చూపించండి అంటూ ట్వీట్ చేశారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. డాక్టర్ నమ్రత నేరం అంగీకరించినట్లు కన్ఫెషన్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఆ కన్ఫెషన్ రిపోర్టు ప్రకారం డాక్టర్ నమ్రత ఏం చెప్పిందంటే.. ‘1998లో మొదటిసారి విజయవాడలో ఫెర్టిలిటీ సెంటర్‌ను స్థాపించాను. 2007లో సికింద్రాబాద్లో రెండో బ్రాంచ్‌ను ప్రారంభించాను. ఆ తర్వాత వైజాగ్‌లోనూ మరో ఫెర్టిలిటీ సెంటర్‌ను ప్రారంభించాను. నా రెండవ కుమారుడు జయంతి కృష్ణ న్యాయవాదిగా ఉంటూ సహకరించేవాడు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
న్యూఢిల్లీ: రెండు పొరుగు దేశాల మధ్య దీర్ఘ కాలంగా ఉన్న సరిహద్దు సమస్యపై చర్చించేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌లో పర్యటించనున్నారు. అందులో భాగంగా సోమవారం ఆయన భారత్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. తూర్పు లడాఖ్‌లో 2020 సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి..
రోడ్ల డ్యామేజీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష..
మరికాసేపట్లో భారీ వర్షం.. బయటకు రావొద్దన్న అధికారులు
Read Latest Telangana News and National News