Share News

Nara Lokesh on Free Bus: ఉచిత బస్సు కేవలం ప్రయాణం కాదు.. నారా లోకేష్

ABN , Publish Date - Aug 16 , 2025 | 02:26 PM

ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం వేదికగా ట్వీట్ చేశారు. మీ ఉచిత బస్సు టికెట్ తో సెల్ఫీ దిగి సాధికరత ఏంటో చూపించాలని మహిళలకు పిలుపునిచ్చారు.

Nara Lokesh on Free Bus: ఉచిత బస్సు కేవలం ప్రయాణం కాదు.. నారా లోకేష్
Nara Lokesh on Free Bus

అమరావతి: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని కానుకగా ప్రకటించింది. సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.


ఎక్స్ లో చేసిన పోస్టులో ఇలా రాసుకొచ్చారు. ఉచిత బస్సు టికెట్ అనేది నమ్మకానికి నిదర్శనం... స్వేచ్చకు, గౌరవానికి ప్రతీక. ఇది ప్రయాణం కాదు ఓ కదలిక, స్వేచ్చాయుత, సమాన అవకాశం. స్త్రీ శక్తి ద్వారా ఏపీ ప్రభుత్వం మహిళల సాధికారితకు పట్టంకట్టింది. సోదరసోదరీమణులారా...ఈ ప్రయాణాన్ని వేడుకగా నిర్వహించుకుందాం. మీ ఫ్రీ బస్సు టికెట్ తో సెల్ఫీ దిగి ఈ ప్రపంచానికి సాధికారిత అంటే ఎలా ఉంటుందో చూపించండి అంటూ ట్వీట్ చేశారు.


రాష్ట్రంలో సుమారు 2.62 కోట్ల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా లాభం చేకూరనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.162 కోట్లు, సంవత్సరానికి దాదాపు రూ.1,942 కోట్లు ఖర్చు చేస్తోంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి అన్ని బస్సుల్లో మహిళలు ఎక్కడికైనా, ఎంతదూరమైనా రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ 11,449 బస్సులను నడుపుతుండగా, వాటిలో 8,458 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అంటే సుమారు 74 శాతం బస్సుల్లో స్ట్రీ శక్తి పథకం కింద మహిళలు ఎలాంటి ఛార్జీలు లేకుండా వెళ్ళే వీలు ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

వరద పోటుకు దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్‌ ఎగువ కాఫర్ డ్యాం సీపేజ్

అదిగో పులి.. ఇదిగో తోక...

Read Latest AP News and National News

Updated Date - Aug 16 , 2025 | 03:14 PM