Khammam News: కనకగిరి అడవుల్లో నీలిరంగు పుట్టగొడుగు
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:56 PM
న్యూజిలాండ్ దేశానికి చెందిన ఎంటోలోమా హోచెస్టెటెరీ జాతికి చెందిన నీలి ఆకాశ పుట్టగొడుగు (స్కైబ్లూ మష్రూమ్) మన కనకగిరి అడవుల్లో మొలకెత్తింది. ఈ విషయాన్ని ఎఫ్‌డీవో వాడపల్లి మంజుల ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్‌లోని పెనుబల్లి, కల్లూరు మండలాల్లో విస్తరించి ఉన్న కనకగిరి హిల్స్‌లోని పులిగుండాల వద్ద ఈ అరుదైన మష్రూమ్ మొలకెత్తిందన్నారు.
- న్యూజిలాండ్‌లోని ఎంటోలోమా హోచెస్టెటెరీ జాతికి చెందినదిగా అధికారుల వెల్లడి
సత్తుపల్లి(ఖమ్మం): న్యూజిలాండ్ దేశానికి చెందిన ఎంటోలోమా హోచెస్టెటెరీ జాతికి చెందిన నీలి ఆకాశ పుట్టగొడుగు (స్కైబ్లూ మష్రూమ్) మన కనకగిరి అడవుల్లో మొలకెత్తింది. ఈ విషయాన్ని ఎఫ్‌డీవో వాడపల్లి మంజుల ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్‌లోని పెనుబల్లి, కల్లూరు(Penuballi, Kallur) మండలాల్లో విస్తరించి ఉన్న కనకగిరి హిల్స్‌లోని పులిగుండాల వద్ద ఈ అరుదైన మష్రూమ్ మొలకెత్తిందన్నారు. దీనిని ఆహారంగా తీసుకున్నట్లయితే పాయిజన్‌లా మారుతుందని చెప్పారు.
పులిగుండాల ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న పురాతన శివాలయం (గుండెపూడి) వెనుక దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ మష్రూమ్‌ను కనుగొన్నట్లు పేర్కొన్నారు. విలక్షణమైన రంగు కలిగి ఈ నీలి ఆకాశ పుట్టగొడుగు అరుదైన లక్షణమైన అజులీన్ వర్ణ ద్రవ్యాల వల్ల కలుగుతుందని, వర్షాకాలంలో తేమస్థాయిలకు అనుకూలంగా ఉన్నచొట్ల మొలకెత్తుతుందని అఽధికారులు తెలిపారు. న్జూజిలాండ్ దేశంలో 2002లో జారీచేయబడిన యాబై డాలర్ల నోటుపై ఈ పుట్టగొడుగు చిహ్నంగా కనపిస్తుందని,
ఇది ఒక సాప్రోబిక్ శిలీంద్రమని, సేంద్రీయ పదార్ధాన్ని విచ్ఛిన్నం చేస్తుందని, అటవీ ప్రాంతంలో షోషకచక్రానికి దోహదం చేస్తుందని ఎఫ్‌డీవో తెలిపారు. తెలంగాణ అడవుల్లో జీవవైవిద్యం సంరక్షించబడుతుందని, భవిష్యత్ తరాల కోసం, ఇతర పరిశోధనల కోసం మనం రక్షించాల్సిన ఆవశ్యకత ఉందని, ఇలా వివిధ రకాలు, జాతులకు చెందిన పశుపక్ష్యాదులు, జీవాలతో పాటు అరుదైన రకానికి చెందిన మొక్కలు మనకు దర్శనమివ్వడం సంతోషంగా ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News