Share News

Nitish Kumar: 1 కోటి ఉద్యోగాలు, కంపెనీలకు ఉచితంగా భూమి.. సీఎం కీలక ప్రకటన

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:51 PM

బీహార్‌లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజల మనసు గెలుచుకునేందుకు ప్రధాన పార్టీలు కీలక ప్రకటనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Nitish Kumar: 1 కోటి ఉద్యోగాలు, కంపెనీలకు ఉచితంగా భూమి.. సీఎం కీలక ప్రకటన
Nitish Kumar 1 crore jobs

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్ రాజకీయాలు హాట్ హాట్‎గా కొనసాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర యువత కోసం ఒక కోటి ఉద్యోగ అవకాశాలతోపాటు పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించే పథకాలను ప్రకటించారు. 2020లో మొదలైన సాత్ నిశ్చయ్-2 కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని సీఎం నితీష్ ప్రస్తావించారు.


కంపెనీలు పెట్టే వారికి..

ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదని, పని చేసి చూపించడానికి తీసుకున్న నిర్ణయమని నితీష్ కుమార్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా కంపెనీలు పెట్టే వారికి పలు రకాల ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు.


ప్రధానంగా ప్రకటించిన అంశాలు ఇవే..

ప్రోత్సాహకాలు రెట్టింపు – రాజధానిలో పెట్టుబడి చేస్తే సబ్సిడీ, వడ్డీపై సబ్సిడీ, జీఎస్టీ రీఇంబర్స్‌మెంట్ మొత్తం రెట్టింపు చేయబోతున్నారు.

ప్రతి జిల్లాలో భూమి ఏర్పాటు – పరిశ్రమల కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో భూమిని కేటాయించనున్నట్టు తెలిపారు.

ఉచిత భూమి – ఎక్కువ ఉద్యోగాలు సృష్టించే పరిశ్రమలకు భూమిని ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు

శాశ్వత పరిష్కారం – పరిశ్రమల కోసం కేటాయించిన భూములపై ఏదైనా వివాదాలు ఉంటే, వాటిని వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.

6 నెలల గడువు – ఈ ప్రయోజనాలన్నీ వచ్చే 6 నెలల్లో పరిశ్రమలు స్థాపించే వారికి మాత్రమే వర్తించనున్నాయని స్పష్టం చేశారు.


ఆత్మనిర్భర్ బీహార్ లక్ష్యంగా

ఈ నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే బీహార్ యువతకు అవకాశాలు కల్పించి, వారిని నైపుణ్యంతో ముందుకు తీసుకెళ్లడం. పరిశ్రమల ద్వారా ఉపాధిని పెంచడం, రాష్ట్రాన్ని ఆత్మనిర్భరంగా తయారు చేయడమేనని సీఎం అన్నారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అందుకే రాష్ట్రంలో పరిశ్రమల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని నితీష్ చెప్పారు. త్వరలో దీనిపై పూర్తి నోటిఫికేషన్ వస్తుందన్నారు. యువత, పారిశ్రామిక వర్గాలు ఇద్దరినీ ఆకట్టుకునే విధంగా వ్యవస్థను అభివృద్ధి పరచాలని నితీష్ భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2025 | 12:52 PM