Share News

Interest Rates: ఆగస్టులో ధమాకా ఆఫర్..వడ్డీ రేట్లను తగ్గించిన SBI, BOB, IOB

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:10 PM

లోన్ తీసుకోవాలని చూస్తున్న వారికి, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు గుడ్ న్యూస్ తెలిపాయి. ఇటీవల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (MCLR) తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. దీని వల్ల ప్రయోజనం ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.

Interest Rates: ఆగస్టులో ధమాకా ఆఫర్..వడ్డీ రేట్లను తగ్గించిన SBI, BOB, IOB
Interest Rates

దేశంలోని ప్రముఖ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపాయి. ఎందుకంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (MCLR) తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో లోన్ తీసుకోవాలనుకుంటున్న వారికీ, ఇప్పటికే ఫ్లోటింగ్ రేట్ లోన్లు తీసుకున్న వారికీ ఇది శుభవార్త అని చెప్పవచ్చు.

వడ్డీ రేట్లు తగ్గితే నెలవారీ ఈఎంఐల భారం కొంత తగ్గనుంది. ప్రధానంగా హౌసింగ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకునే వారికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే ఈ కొత్త రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


  • SBI: 15 ఆగస్టు 2025 నుంచి

  • Bank of Baroda: 12 ఆగస్టు 2025 నుంచి

  • Indian Overseas Bank: 15 ఆగస్టు 2025 నుంచి

MCLR అంటే ఏంటి?

MCLR అనేది బ్యాంకులు ఒక లోన్‌కు కనీసంగా వసూలు చేయగల వడ్డీ రేటు. దీన్ని బ్యాంకులు తమ ఖర్చులు, ఆర్బీఐ రెపో రేటు ఆధారంగా నిర్ణయిస్తాయి. MCLR తగ్గితే, ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో తీసుకున్న హోం లోన్, పర్సనల్ లోన్‌లపై వంటి వాటిపై వడ్డీ తగ్గుతుంది. అంటే మీ నెలవారీ ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది.


ప్రధానంగా ఈ బ్యాంకులు..

SBIలో హోం లోన్ తీసుకుంటే ఎక్కువగా 1 Year MCLR మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇది 8.80% నుంచి 8.75%కి తగ్గడం మంచి పరిణామం. BoB కూడా తమ రేట్లను SBI లాగే ఉంచింది. ఫలితంగా వినియోగదారులకు అదే స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. IOB రేట్లు SBI, BoB కంటే కొంచెం ఎక్కువే ఉన్నా, ఈ తగ్గింపు వల్ల EMIలో మాత్రం మార్పు రానుంది.


ఏంటి ప్రయోజనం

  • మీరు ఇప్పటికే హోం లోన్ ఫ్లోటింగ్ రేటుతో తీసుకున్నట్లైతే ఈ తగ్గింపు వల్ల మీ EMI తగ్గే అవకాశం ఉంది.

  • కొత్తగా లోన్ తీసుకోవాలని చూస్తున్న వారు అయితే, తక్కువ వడ్డీ రేటుకు రుణాలను పొందవచ్చు

  • మీరు fixed rate లోన్ తీసుకున్నట్లయితే, ఈ తగ్గింపులో ప్రయోజనం ఉండదు. కానీ రీపైనాన్స్ చేయాలంటే చేసుకునే అవకాశం ఉంటుంది.

  • ఈ మూడు ప్రధాన బ్యాంకులు MCLR తగ్గించాయంటే, మార్కెట్‌లో ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను క్రమంగా తగ్గించే అవకాశం ఉంది


ఇవి కూడా చదవండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2025 | 12:11 PM