Home » Nitish Kumar
డిఫెన్స్ కారిడార్, సెమికండక్టర్ తయారీ పార్క్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, మెగా టెక్ సిటీ, ఫిట్‌నెస్ సిటీ ఏర్పాటుతో బీహార్‌ను ఈస్ట్రన్ ఇండియా టెక్ హబ్‌గా తయారు చేయాలని మంత్రివర్గ మావేశంలో నిర్ణయించినట్టు సీఎస్ తెలిపారు.
తన తండ్రి ఇప్పటికి తొమ్మిది పర్యాయాలు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, ఏనాడూ రాజకీయాల జోలికి రాలేదు నితీష్ కుమార్ తనయుడు నిషాంత్ కుమార్. అయితే, ఇవాళ నితీష్ పదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేళ నిషాంత్ ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు.
బిహార్ ముఖ్యమంత్రిగా ఇవాళ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు హాజరైన ప్రధాని మోదీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. బీహార్ పర్యటన మొత్తం మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించిన ప్రధాని మోదీ నేడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తున్నారు.
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్‌తో పాటు 27 మంది మంత్రులు కూడా తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నితీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను సమర్పించారు.
ఎన్డీయేకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు పాట్నాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నితీశ్‌ను ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దిలీప్ జైశ్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారి తదితరులు పాల్గొన్నారు.
నితీశ్ కుమార్ బుధవారం సాయంత్రం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలుసుకునే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. ఎన్డీయే నేతల మద్దతు లేఖను కూడా ఆయన గవర్నర్‌కు అందజేస్తారు.
ఎన్డీయే ప్రతిపాదించినట్టు చెబుతున్న ఫార్ములా ప్రకారం, బీజేపీకి కేబినెట్‌లో సింహభాగం వాటా దక్కనుంది. 15 నుంచి 16 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. జేడీయూకు 14 మంత్రి పదవుల వరకూ దక్కవచ్చు.
దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన బీహార్ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఎన్డీయే పక్షం తన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ 35 స్థానాలకు పరిమితమైంది.
బీజేపీ 95 సీట్లలో గెలుపును ఖాయం చేసుకుని రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించనుండగా, జేడీయూ 82 సీట్లలోనూ, ఎల్‌జేపీ 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లలో గెలుపును ఖాయం చేసుకున్నాయి.