Bharat Ratna: నితీశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి.. కేంద్ర మంత్రుల సూచన
ABN , Publish Date - Jan 10 , 2026 | 10:02 PM
జేడీయూ నేత కేసీ త్యాగి సైతం భారతరత్న అవార్డును నితీశ్‌కు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒక లేఖలో కోరారు. సోషలిస్ట్ ఉద్యమానికి మణిమకుటం నితీశ్ అని, భారతరత్న పురస్కారానికి అర్హులని అందులో పేర్కొన్నారు.
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar)కు దేశ అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న' (Bharat Ratna) ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. తాజాగా నితీశ్‌కు భారతరత్న ఉవ్వాలని కేంద్ర మంత్రులు జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్‌లు సూచించారు.
'తమ నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నితీశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతారని మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో జితన్ రామ్ మాంఝీ పేర్కొన్నారు. పాశ్వాన్ సైతం మరో పోస్టులో ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో రెండు దశాబ్దాలుగా బిహార్ సాధించిన ప్రగత నిశ్చయంగా ఆయనను భారతరత్న పురస్కారానికి అర్హుడిని చేస్తుందని అన్నారు. దీంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పారు. అయితే ఇండియాలో కొందరి డిమాండ్లు, ఆకాంక్షాలకు అనుగుణంగా దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఇవ్వరని తాను నమ్ముతానని అన్నారు. దీనికి ఒక నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుందని, అందుకు తగిన వారే భారతరత్నకు అర్హులవుతారని చెప్పారు.
మోదీకి కేసీ త్యాగి లేఖ
కాగా, దీనికిముందు జేడీయూ నేత కేసీ త్యాగి సైతం భారతరత్న అవార్డును నితీశ్‌కు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒక లేఖలో కోరారు. సోషలిస్ట్ ఉద్యమానికి మణిమకుటం నితీశ్ అని, భారతరత్న పురస్కారానికి అర్హులని అందులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో మోదీ... సాదర స్వాగతం
చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి.. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి