Home » Free Bus For Women
సూపర్ సిక్స్‌లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని గత ఆగస్టు నెల నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మహిళకూ ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. ఈ మేరకు ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకూ ఈ పథకానికైన ఖర్చును ఏపీఎస్ ఆర్టీసీకి చెల్లిస్తూ కూటమి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
ఓ వృద్ధురాలు టికెట్ తీసుకోకుండా రైలులో ప్రయాణం చేస్తూ ఉంది. ఇంతలో టికెట్ కలెక్టర్ ఆమె దగ్గరకు వచ్చాడు. టికెట్ చూపించమని అడిగాడు. ఆ వృద్ధురాలు వెంటనే తన దగ్గర ఉన్న ఆధార్ కార్డు తీసి అతడి చేతిలో పెట్టింది.
ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్నిఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించారు. ఈ పథకం అన్ని తరగతులవారికి ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. ఈ పథకాన్ని వినియోగించుకుని మహిళలు ఎన్నో ఆధ్యాత్మిక ప్రాంతాలను చుట్టేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుప్పం పర్యటనలో కడా ద్వారా ఆరు కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
తిరుపతి-తిరుమల నడుమ కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు చేసిన ప్రకటన మహిళా యాత్రికులను మహదానందానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి ఉచితంగానే తిరుపతికి చేరుకున్నా తిరుమలకు మాత్రం చార్జీలు చెల్లించాల్సిరావడం వీరిని అసంతృప్తికి గురిచేసింది. తాజా నిర్ణయం అమలు తేదీ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి తిరుమలకు ఉచితం చేయడం వల్ల ఆర్టీసీ మీద పడే భారం కూడా ఏమంత ఎక్కువ కాదు.
రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. రోజుకు 25 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సేవలను వినియోగించుకుంటున్నారని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ఇది చూసి వైసీపీ అధినేత జగన్, అతడి పార్టీ నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని ఫైర్ అయ్యారు.
ఆంధ్రాలో ఫ్రీ బస్సు స్కీమ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ ఈ స్కీమ్‌ని తప్పుదారి పట్టించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై టీడీపీ నేత శీరిష తనదైన శైలిలో స్పందించారు.
ఘాట్ రూట్లలో ఉచిత ప్రయాణానికి గతంలో అనుమతించని ఆర్టీసీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఘాట్ రూట్‌లలోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
మహిళలకు అవకాశాలు కల్పిస్తే ఏదైనా చేస్తారని, అద్భుతాలు సృష్టిస్తారని పీతల సుజాత ధీమా వ్యక్తం చేశారు. మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు రాష్ట్ర మహిళల తరఫున ఆమె ధన్యవాదాలు తెలిపారు.