Free Bus Scam: ఫ్రీ బస్సు స్కీమ్‌పై వైసీపీ కుట్రలు..టీడీపీ నేత శిరీష కౌంటర్
ABN , Publish Date - Aug 17 , 2025 | 02:06 PM
ఆంధ్రాలో ఫ్రీ బస్సు స్కీమ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ ఈ స్కీమ్‌ని తప్పుదారి పట్టించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై టీడీపీ నేత శీరిష తనదైన శైలిలో స్పందించారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న ఫ్రీ బస్సు స్కీమ్ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తప్పుదారి పట్టించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ నేత శిరీష దీనిపై తక్షణమే స్పందించారు. ఈ స్కీమ్ మహిళలకు ఎంతో ఉపయోగం, కానీ వైసీపీ దీన్ని రాజకీయంగా వాడుకుంటోందని శీరిష ఆరోపించారు. ఈ నేపథ్యంలో జనం కోసం చేసే మంచి పథకాల్ని కూడా వక్రీకరిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ ఈ స్కీమ్‌ని సక్సెస్‌ఫుల్‌గా నడపాలని, ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని చూస్తుంటే వైసీపీ రాజకీయాలు చేయడం సరికాదన్నారు.