Share News

Sandhya Rani: స్త్రీ శక్తితో మహిళలు హ్యాపీ.. అందుకే జగన్‌కు కడుపు మంట: మంత్రి సంధ్యారాణి

ABN , Publish Date - Aug 18 , 2025 | 01:37 PM

రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. రోజుకు 25 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సేవలను వినియోగించుకుంటున్నారని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ఇది చూసి వైసీపీ అధినేత జగన్, అతడి పార్టీ నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని ఫైర్ అయ్యారు.

Sandhya Rani: స్త్రీ శక్తితో మహిళలు హ్యాపీ.. అందుకే జగన్‌కు కడుపు మంట: మంత్రి సంధ్యారాణి
Sandhya Rani Slams Opposition Over Free Bus Scheme

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. అమరావతిలో జరిగిన మీడియాతో మాట్లాడుతూ, రోజుకు 25 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సేవలు వినియోగించుకుంటున్నారని అన్నారు. మహిళలు ఈ పథకం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పథకం విజయాన్ని చూసి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు కడుపు మంటతో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నాం. రాష్ట్రంలోని మహిళలందరినీ సమాన దృష్టితో చూస్తూ కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ సదుపాయం కల్పిస్తోంది. వ్యాపారం చేసుకునేవారు, చిరుద్యోగులకు నెలకు 2 నుంచి మూడు వేలు మిగులుతుంది. మహిళలతొ పాటు ట్రాన్స్ జెండర్‌లకు కూడా అవకాశం కల్పించాం. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ఎన్ని సార్లయినా ఫ్రీ బస్ సౌకర్యం అందిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ విజయం చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇష్టమొచ్చిన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.


భరతమాత అంటే కూడా గౌరవం లేని వ్యక్తి జగన్. సీఎంగా పనిచేసి కూడా కనీసం ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరవేయలేదు. తల్లినీ, చెల్లినీ కోర్టు మెట్లెక్కించాడు. ఇలాంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి దారుణంగా లింకులు లేకుండా మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వంలో పింఛన్ 250 రూపాయలు పెంచడానికి సంవత్సరం పట్టింది. వెయ్యి రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఇంట గెలవలేదు.. రచ్చ గెలవలేదు. మీకు ప్రతిపక్షహదా ఇవ్వలేదని ప్రజలపై అక్కసు వెళ్లగక్కుతున్నారని వైసీపీపై ధ్వజమెత్తారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం వంటి పథకాలతో మహిళలు ఆనందంగా ఉన్నారు. ఇది చూసి జగన్‌కు అసహనం కలుగుతోంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్న విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు అర్థం చేసుకోవాలి. ప్రజలపై అక్కసుతో మాట్లాడితే, ఇప్పటికి ఉన్న 11 స్థానాలే కాదు, అవి కూడా పోతాయి అంటూ హెచ్చరించారు. అలాగే మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలపై కూడా మంత్రి సంధ్యారాణి స్పందించారు. మహిళల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదన్నారు. జబర్దస్త్ వ్యవహార శైలిని ఇప్పటికైనా మార్చుకోవాలని సూచించారు.


ఇదిలా ఉంటే, తిరుమల కొండపై ఫ్రీ బస్ సౌకర్యం కల్పించకపోవడానికి గల కారణాన్ని మంత్రి సంధ్యారాణి వివరించారు. 'తిరుపతిలో కొండపైకి వెళ్లే బస్సులు కేవలం సిటీ వరకే తిరుగుతాయి. అక్కడ ఫ్రీ ఇస్తే స్టాండింగ్ కూడా ఉంటుంది... అది ప్రమాదకరం. అందుకే ఘాట్ రోడ్లలో ఉచితబస్సు లేదని ముందే చెప్పాం. 60నుండి 70శాతం డోలి మోతలు తగ్గించాం... ఈసంవత్సరం 1000కోట్లు వరకూ రోడ్లకు కేటాయిస్తాం. హిల్ టాప్ ఏరియాలో ఉన్న గ్రామాలకు ముందు వేసి తరువాత గ్రామాలకు కనెక్టివిటీ చేస్తున్నాం. 3 సంవత్సరాల్లోగా దాదాపు అన్ని గ్రామాలను కలపాలని భావిస్తున్నా... ఇంకా మిగిలితే వీలున్నంత తొందరగా పూర్తిచేస్తాం. గత ప్రభుత్వ హయంలో ఒక్క రోడ్డు వేయలేదు.... గుంతలు పూడ్చలేదు. అందుకే మాకు రెండింతలు పని పడుతోంది. ఎస్టీ సబ్ ప్లాన్ పై గతేడాది నుండి దృష్టి పెట్టినట్లు' తెలిపారు.


ఇవి కూడా చదవండి

LICలో డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షపైగా జీతం.

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా లోకేశ్ ఢిల్లీ పర్యటన..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 18 , 2025 | 01:38 PM