Visakhapatnam: విశాఖలో కాల్పుల కలకలం.. పరారైన కానిస్టేబుల్..
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:48 PM
విశాఖపట్నంలో కాల్పులు కలకలం రేపాయి. పాత కక్షల కారణంగా నాటు తుపాకీతో కాల్చడంతో రాజేష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. కాల్పుల జరిపిన వ్యక్తి సస్పెన్షన్‌లో ఉన్న కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు.
విశాఖపట్నంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిలకపేట ప్రధాన గేట్ సమీపంలో చేపల రాజేష్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడిన రాజేష్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాతకక్షలే కాల్పులకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల జరిపిన వ్యక్తి స్పెన్షన్‌లో ఉన్న కానిస్టేబుల్ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటన అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కాల్పుల ఘటనతో వన్‌టౌన్ పరిసరాల్లో ఒకింత ఉద్రిక్తత నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు సస్పెన్షన్‌లో ఉన్న కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పరారైన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం వెలువడే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
LICలో డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షపైగా జీతం.
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా లోకేశ్ ఢిల్లీ పర్యటన..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి