Minister Lokesh: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా లోకేశ్ ఢిల్లీ పర్యటన..
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:14 PM
వర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులకు నిధులు ఇవ్వాలని మంత్రి లోకేశ్ కోరారు. ఈ మేరకు సింగపూర్ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చర్చల వివరాలు ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల ప్రవాసాంధ్రులు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారని తెలిపారు.
ఢిల్లీ: ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన వాడివేడిగా సాగుతోంది. ఇవాళ(సోమవారం) కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో డాటా సిటీ, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం కేంద్ర సహకారించాలని ఆయన కోరారు. విశాఖపట్నంలో డాటా సిటీ అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే యోచన ఉందని తెలిపారు. ప్రవాస భారతీయ బీమా యోజనను విస్తరించి, ఏపీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని జైశంకర్‌ను విజ్ఞప్తి చేశారు. వలస కార్మికుల భద్రత, సంక్షేమం కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లోకేశ్ కోరారు.
అలాగే.. వర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులకు నిధులు ఇవ్వాలని మంత్రి లోకేశ్ కోరారు. ఈ మేరకు సింగపూర్ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చర్చల వివరాలు ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల ప్రవాసాంధ్రులు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారని తెలిపారు. యూఎస్‌లో ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం $1,26,000 డాలర్లని లోకేష్ గర్వంగా పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్ మద్దతు ఉటుందని తెలిపారు. రష్యా, ఆస్ట్రేలియాతో జాయింట్ ట్రైనింగ్, ఇనిస్టిట్యూషనల్ ట్విన్నింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగార్థులు, పరిశ్రమలను అనుసంధానించే నైపుణ్యం పోర్టల్ త్వరలో ప్రారంభం అవుతుందని తెలియజేశారు. జపాన్, కొరియా, తైవాన్‌తో మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్‌షిప్ అరేంజ్‌మెంట్(MMPA)పై దృష్టి పెట్టామని వివరించారు. ప్రపంచ డయాస్పోరా వేదికగా పెట్టుబడులు, నాలెడ్జి ట్రాన్స్ఫర్, టెక్నాలజీ ఆవిష్కరణలకు ఎపీకి మెరుగైన విదేశీ ఉద్యోగావకాశాల కోసం కేంద్రం నుంచి డాటా షేరింగ్ సహకారం కావాలని లోకేశ్ కోరారు.
ఇవి కూడా చదవండి
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ.. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం..
భారీ వర్షాలు.. ప్రజలకు మంత్రి గొట్టిపాటి సూచనలివే