Share News

Condor Boeing 757: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. గాల్లో ఉండగా విమానంలో మంటలు..

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:12 PM

Condor Boeing 757: మంటల్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని ఇటలీ వైపు తిప్పారు. బ్రిన్‌డిసి ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండ్ చేశారు. ఇక, ఈ సంఘటనపై కాండార్ ఎయిర్‌వేస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Condor Boeing 757: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. గాల్లో ఉండగా విమానంలో మంటలు..
Condor Boeing 757

ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం కుప్పకూలిన తర్వాత.. ప్రపంచ వ్యాప్తంగా అలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. విమాన ప్రమాదాల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, ఓ పెను ప్రమాదం నుంచి వందల మంది విమాన ప్రయాణికులు తప్పించుకున్నారు. విమానం గాల్లో ఉండగా ఏకంగా మంటలు చెలరేగాయి. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజిన్‌లో మంటలు మొదలయ్యాయి.


ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బోయింగ్ 757-300 విమానం గ్రీసులోని, కోర్ఫు ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టునుంచి దుస్సెల్ డార్ఫ్ బయలు దేరింది. విమానం టేకాఫ్ అయి గాల్లోకి లేచిన కొన్ని నిమిషాలకే అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఇంజిన్ సరిగా పని చేయకపోవటం వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.


మంటల్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని ఇటలీ వైపు తిప్పారు. బ్రిన్‌డిసి ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండ్ చేశారు. ఇక, ఈ సంఘటనపై కాండార్ ఎయిర్‌వేస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ విమాన ప్రమాదాలను చూస్తుంటే భయం వేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు’..‘అదృష్టం కొద్దీ విమానం పేల లేదు.. లేదంటే వందల మంది చనిపోయేవారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మేకను మింగిన కొండచిలువు.. గ్రామస్తులు ఏం చేశారంటే..

మనిషి శరీరంలో 'రెండవ గుండె' ఏదో మీకు తెలుసా?

Updated Date - Aug 18 , 2025 | 12:16 PM