Share News

20 Ft Python: మేకను మింగిన కొండచిలువు.. గ్రామస్తులు ఏం చేశారంటే..

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:35 AM

20 Ft Python: కొండ చిలువ మేకను మింగటం చూసి షాక్ అయ్యాడు. అతడు గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న గ్రామస్తులను పిలిచాడు. కొంతమంది కర్రలు, గొడ్డలి తీసుకుని అక్కడికి వచ్చారు. పాముపై దాడి చేసి, మేకను రక్షించే ప్రయత్నం చేశారు.

20 Ft Python: మేకను మింగిన కొండచిలువు.. గ్రామస్తులు ఏం చేశారంటే..
20 Ft Python

మేకను చంపి, మింగుతూ ఉన్న కొండ చిలువపై గ్రామస్తులు దాడి చేశారు. విచక్షణా రహితంగా గొడ్డలితో నరికి చంపేశారు. కొండ చిలువ నోట్లోంచి మేకను బయటకు లాగారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఝాన్సీలోని పునావాలీ గ్రామానికి చెందిన 35 ఏళ్ల జశ్వంత్ రాజ్‌పుత్ మేకలు మేపడానికి రాజ్‌ఘట్ కెనాల్ సమీపంలోకి వెళ్లాడు. మేకలు కెనాల్ దగ్గరలో గడ్డి మేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 20 అడుగుల కొండ చిలువ ఓ మేకపై దాడి చేసింది.


అనంతరం మేకను చుట్టి, మింగసాగింది. మేక ప్రాణ భయంతో గట్టిగా అరవసాగింది. మేక అరుపులు విన్న జశ్వంత్ అక్కడికి వచ్చాడు. కొండ చిలువ మేకను మింగటం చూసి షాక్ అయ్యాడు. అతడు గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న గ్రామస్తులను పిలిచాడు. కొంతమంది కర్రలు, గొడ్డలి తీసుకుని అక్కడికి వచ్చారు. పాముపై దాడి చేసి, మేకను రక్షించే ప్రయత్నం చేశారు. అతి కష్టం మీద మేకను పాము నోట్లోంచి బయటకు లాగారు. అయితే, మేక అప్పటికే చనిపోయింది.


దీంతో గ్రామస్తుల కోపం కట్టలు తెంచుకుంది. అందరూ దాన్ని చుట్టుముట్టి కొట్టి చంపేశారు. తర్వాత దాన్ని రోడ్డుపై లాక్కెళ్లారు. అంత పెద్ద పామును చూసిన గ్రామస్తుల్లో భయం పట్టుకుంది. చిన్నపిల్లలు, ఆడవాళ్లను అటువైపు వెళ్లవద్దని ఊరి పెద్దలు హెచ్చరించారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వాళ్లు పామును చంపాల్సింది కాదు.. అటవీ అధికారులకు ఫోన్ చేసి ఉంటే సరిపోయేది’ అంటున్నారు.


ఇవి కూడా చదవండి

మానసిక వేధింపులను ఎదుర్కొనే మహిళల్లో గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువ

మోదీ చాలా ప్రమాదకారి.. గద్దె దింపాలి: ఖర్గే

Updated Date - Aug 18 , 2025 | 11:45 AM