Secret Detox Organ: మనిషి శరీరంలో 'రెండవ గుండె' ఏదో మీకు తెలుసా?
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:10 AM
చెడు ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి కారణంగా శరీరంలో మలినాలు క్రమంగా పేరుకుపోతాయి. శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోకుంటే ఈ మలినాలు అనేక తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చు. ఆయుర్వేదం ప్రకారం శరీరాన్ని డీటాక్సిఫై ఇచ్చే సీక్రెట్ ఆర్గాన్ ఇదే..
ఆధునిక శాస్త్రం పురోగతి సాధించి చికిత్స లేని వ్యాధులను నయం చేసే మార్గాలను కనుగొన్నప్పటికీ, ఆయుర్వేద వైద్యానికి డిమాండ్ తగ్గట్లేదు. అల్లోపతి వైద్యం ద్వారా నయం చేయలని ఎన్నో వ్యాధులకు ఆయుర్వేద చికిత్స సంజీవనిలా పనిచేస్తోంది. ఇక, డీటాక్సిఫికేషన్ విషయానికి వస్తే.. ఈ సమస్యకు పరిష్కారం మన శరీరంలోని కాళ్లే అని ఆయుర్వేదం చెబుతోంది. వీటిని 'రెండవ గుండె' అని పిలుస్తారు. సైన్స్ ప్రకారం 'సోలియస్ కండరం' అని వ్యవహరిస్తారు. ఆయుర్వేదం దీనిని మన శరీర సహజ నిర్విషీకరణ వ్యవస్థగా వర్గీకరిస్తుంది.
తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం, ధూమపానం, మద్యపానం, తక్కువ శారీరక శ్రమ ఇవన్నీ ప్రజల మనస్సు, శరీరంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన వ్యాధులు చుట్టుముట్టవచ్చు. ఈ జీవనశైలి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి శరీరాన్ని డీటాక్స్ చేయడం. అంటే శరీరం అంతర్గతంగా పేరుకుపోయిన మలినాలనుశుభ్రపరచడం. శరీరంలో పేరుకుపోయిన మురికిని తొలగించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు. ఇందుకు చక్కటి పరిష్కారం మన శరీరంలోనే ఉంది. అవే కాళ్లు.
'రెండవ గుండె'ఎక్కడ ఉంది?
శరీరంలోని కాఫ్ మజిల్స్‌నే రెండవ గుండెగా పిలుస్తారు, ముఖ్యంగా సోలియస్ కండరం. కాఫ్ కండరం గుండె వైపు సిరలకు రక్తాన్ని పంప్ చేయడానికి ఉపయోగపడటం వల్ల ఈ పేరొచ్చింది. మన ఇతర కండరాల మాదిరిగా కాకుండా సోలియస్ కండరం తేలికగా అలసిపోదు. నిలబడి ఉన్నప్పుడు కూడా ఇది నిరంతరం పనిచేస్తుంది. మనం మన కాళ్ళను కదిలించిన ప్రతిసారీ ముఖ్యంగా మనం నేలపై నడుస్తున్నప్పుడు, సున్నితమైన కదలికలు చేసినా సోలియస్ కండరం సక్రియం అవుతుంది. ఇది గుండెకి పంపులా పనిచేస్తుంది. రక్తం, శోషరస ద్రవాన్ని హృదయాన్ని సరఫరా చేస్తుంది.
ఎందుకు ముఖ్యమైనది?
ఇది మన శక్తిని పెంచుతుంది. శారీరక అలసటను తగ్గిస్తుంది.
మొత్తం హృదయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.
మన శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది.
దిగువ అవయవాలలో రక్తం స్తబ్దతను నివారిస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం, వాత దోషాన్ని ప్రాణ, ఉదాన, సమాన, వ్యాన, అపాన అనే ఐదు రకాలుగా విభజించారు. వ్యాన వాయు మన శరీరంలో రక్త ప్రసరణను, శరీరం అంతటా శక్తి, శోషరస ప్రవాహాన్ని, హృదయ స్పందన, నాడీ వ్యవస్థ, కండరాలు, కీళ్ల కదలికలు, కణ వ్యర్థాల తొలగింపు, పోషకాలు, ఆక్సిజన్ పంపిణీ వంటి అనేక విధులను నిర్వహిస్తుంది. ఈ పనులన్నింటిలో సోలియస్ కండరందే కీలక పాత్ర. అందుకే తరచూ చెప్పులు లేకుండా గడ్డిపై నడవడం, కాళ్లను స్ట్రెచింగ్ చేయడం, కాళ్ళకు నూనె రాసి మర్దనా చేయడం, తడసానా, వృక్షాసనం వంటి యోగా భంగిమలు క్రమం తప్పకుండా చేయాలి.
ఇవి కూడా చదవండి:
ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్లకు క్యాన్సర్ ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
బెండకాయతో ఇలా చేస్తే రోగాలన్నీ పరార్..!