Okra Water Benefits: బెండకాయతో ఇలా చేస్తే రోగాలన్నీ పరార్..!
ABN , Publish Date - Aug 17 , 2025 | 08:54 PM
Okra Water Benefits in Telugu: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో.. సరికాని జీవనశైలి కారణంగా అనేక మంది అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ముందు డబ్బు కోసం పరుగులు తీస్తున్న జనాలు.. ఆ తరువాత అదే డబ్బుతో..
Okra Water Benefits in Telugu: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో.. సరికాని జీవనశైలి కారణంగా అనేక మంది అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ముందు డబ్బు కోసం పరుగులు తీస్తున్న జనాలు.. ఆ తరువాత అదే డబ్బుతో జబ్బులను తగ్గించుకునేందుకు తంటాలు పడుతున్నారు. అందుకే ‘ప్రీవెన్షన్ బెటర్ దెన్ క్యూర్’ అని పెద్దలు చెబుతుంటారు. అంటే రోగం వచ్చిన తరువాత తగ్గించుకోవడానికి ఇబ్బంది పడే బదులుగా.. ఆ రోగం రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమం అని అర్థం. ప్రజలు తమ రోజువారి జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకుంటే చాలు మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. అనారోగ్యం బారిన పడకుండా అనేక రకాల హోమ్ రెమిడీస్‌ను వైద్య నిపుణులు చెబుతుంటారు. వాటిలో ఇవాళ మనం ఒక అద్భుతమైన హెల్త్ టిప్ గురించి తెలుసుకుందాం..
ఓక్రా వాటర్..
మున్సిపల్ వాటర్ పేరు విన్నాం.. మినరల్ వాటర్ పేరు విన్నాం.. ఈ ఓక్రా వాటర్ ఏంటని ఆలోచిస్తున్నారా.. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఓక్రా వాటర్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది. ఈ నీటిలో అధిక శాతం ఉండే విటమిన్ సి.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు.. ఇది వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ ఒక గ్లాస్ ఓక్రా వాటర్ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ ఓక్రా వాటర్ ఏంటి..? అసలు దీనిని ఎలా తయారు చేస్తారు..? దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే, బెండకాయను తినడం కంటే, దానిని రాత్రిపూట నీటిలో నానబెట్టి.. ఉదయం ఆ నీటిని తాగితే మరింత ఆరోగ్య ప్రయోజనం ఉంటుందట. ఈ మధ్య కాలంలో ఈ నీటిని తాగే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వలన కలిగే ప్రయోజనాలు ఆ నోటా ఈ నోటా వ్యాప్తి చెందుతుండటంతో.. ప్రజాదరణ భారీగా పెరిగిపోతోంది.
ఓక్రా వాటర్ ఎలా తయారు చేసుకోవాలి..
నాలుగు లేదా ఐదు తాజా బెండకాయలను తీసుకొని, బాగా కడిగి, చిన్న ముక్కలుగా కోయాలి. ఆ ముక్కలను ఒక గాజు సీసా లేదా కంటైనర్‌లో వేసి, నీటితో నింపాలి. రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టాలి. ఉదయం బెండకాయ ముక్కలను నీటిలోంచి తీసి ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలను నివారిస్తుంది..
బెండకాయలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని రసం పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. గ్యాస్, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
మధుమేహ నియంత్రణ..
ఓక్రా నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది డయాబెటిస్ ప్రమాదం నుండి రక్షిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ ఒక గ్లాసు ఈ నీరు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ..
బెండకాయ నీళ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు లేడీఫింగర్ వాటర్ తాగడం వల్ల వివిధ ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు.
బరువు తగ్గడంలో..
ఓక్రా నీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఒక గ్లాసు ఓక్రా నీరు త్రాగాలి.
చర్మం ఆరోగ్యానికి..
బెండకాయ నీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది చర్మం అందంగా కనిపించడానికి సహాయపడుతుంది.
ఆర్థరైటిస్ నుండి ఉపశమనం..
ఓక్రా నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లలో వాపును తగ్గిస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆర్థరైటిస్ నుండి రక్షిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది..
బెండకాయలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడతాయి. ఇది గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షిస్తుంది.
క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది..
ఓక్రా నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. తద్వారా క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.
Also Read:
భార్య తన భర్త నుండి కోరుకునేది ఇదే: చాణక్యుడు
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి: సీఎం
For More Health News and Telugu News..