Share News

Late Wife Shefali: గుండెలపై చనిపోయిన భార్య పచ్చబొట్టు వేయించుకున్న నటుడు

ABN , Publish Date - Aug 18 , 2025 | 10:15 AM

Late Wife Shefali: ప్రయాగ్ సోషల్ మీడియాలో షెఫాలీ గురించి తరచుగా ఎమోషనల్ పోస్టులు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పెళ్లి రోజు సందర్భంగా చనిపోయిన భార్యకు ఘన నివాళులు అర్పించాడు.

Late Wife Shefali: గుండెలపై చనిపోయిన భార్య పచ్చబొట్టు వేయించుకున్న నటుడు
Late Wife Shefali

ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రయాగ్ త్యాగీ భార్య ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా అనారోగ్యం కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. భార్య మరణంతో ప్రయాగ్ కుదేలయ్యాడు. దాదాపు రెండు నెలలు అవుతున్నా మామూలు మనిషి కాలేకపోతున్నాడు. సోషల్ మీడియాలో షెఫాలీ గురించి తరచుగా ఎమోషనల్ పోస్టులు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పెళ్లి రోజు సందర్భంగా చనిపోయిన భార్యకు ఘన నివాళులు అర్పించాడు. పెళ్లి రోజును పురష్కరించుకుని భార్య ముఖాన్ని గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నాడు.


ఇందుకు సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో..‘ఎదురుచూపుకు తెరపడింది. మా 15వ పెళ్లి రోజు సందర్భంగా నా పరికి ఇచ్చిన గిఫ్ట్ ఇదే. తను ఎప్పటికీ నా గుండెల్లో ఉంటుంది. నా శరీరంలోని ప్రతీ కణంలో తను ఉంటుంది. ఇప్పుడు ప్రతీ ఒక్కరు దీన్ని చూడొచ్చు’ అని అన్నారు. కాగా, పరాగ్ తన భార్య షెఫాలీ పేరు మీద సామాజిక సేవ కూడా మొదలెట్టాడు. ‘షెఫాలీ జరీవాలా రైజ్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశాడు. ఆడపిల్లల్ని చదివించడానికి.. ఆడవాళ్లకు ఉపాధి కల్పించడానికి సిద్ధమయ్యాడు.


గుండెపోటుతో చిన్న వయసులోనే..

షెఫాలీ జరీవాలా 1982లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. చిన్నతనం నుంచే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఆమె యుక్త వయస్సులో ఉన్నపుడు ‘ఎపిలెప్సీ’ ఉందని తేలింది. షెఫాలీ తరచుగా ఫిట్స్‌తో బాధపడుతూ ఉండేవారు. దాదాపు పదేళ్ల పాటు ఇందుకోసం చికిత్స తీసుకున్నారు. తర్వాత యోగ, వ్యాయామాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. 2002లో కాంటాలగా సాంగ్ రీమిక్స్‌ వీడియోతో సంచలనం సృష్టించారు. ఆ పాట రీమిక్స్‌తో ఆమెకు గుర్తింపు వచ్చినా.. పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. 2025 జూన్ 27వ తేదీన గుండెపోటుతో మరణించారు.


ఇవి కూడా చదవండి

ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

Updated Date - Aug 18 , 2025 | 10:17 AM