Telangana heavy rains: దంచికొడుతున్న వానలు.. సంగారెడ్డి, మెదక్‌లో భారీ వర్షపాతం నమోదు
ABN , Publish Date - Aug 18 , 2025 | 10:52 AM
Telangana heavy rains: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో 17.9 సెం.మీ భారీ వర్షం కురిసింది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.
మెదక్, ఆగష్టు 18: రాష్ట్రంలో వర్షాలు (Heavy Rains) దంచికొడుతున్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరింది. పలు చోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలు బంద్ అయ్యాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో 17.9 సెం.మీ భారీ వర్షం కురిసింది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. సంగారెడ్డి జిల్లా కంగ్టి 17 సెం.మీ భారీ వర్షపాతం నమోదు అయ్యింది. కల్హేర్ 11.9, కడ్పాల్ 10.6, అన్నసాగర్ 10.3 సెం.మీ మేర భారీ వర్షపాతం నమోదు అయ్యింది.
నిన్న (ఆదివారం) సిద్దిపేట జిల్లాలోని గౌరారంలో రికార్డ్ స్థాయిలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ స్థాయి వర్షపాతం నమోదు అయ్యాయి. సిద్దిపేటలోని ములుగులో 18.65 సెంటీమీటర్లు, మెదక్‌లోని ఇస్లాంపూర్‌లో 17.95 సెంటీమీటర్లు, కామారెడ్డిలోని పిట్లంలో 17.5 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరిలోని అడ్డగూడూరులో 16.48 సెంటీమీరట్లు, సంగారెడ్డిలోని కంగ్టిలో 16.9 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే, యాదాద్రి భువనగిరి 16.4, కామారెడ్డి 16, నిజామాబాద్ 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
ఇటు హైదరాబాద్‌లో నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. అలాగే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షం నమోదు అయ్యింది. నిన్న అత్యధికంగా హైదర్‌నగర్‌లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మల్కాజిగిరిలో 4.4, కూకట్‌పల్లి 4.3, కాప్రా, శేర్లింగంపల్లి 4.2, కుత్బుల్లాపూర్, అల్వాల్, బీహెచ్ఈఎల్, రామచంద్రపురంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అటు నేరేడ్‌మెట్, ఉప్పల్, మల్లాపూర్, గాజులరామారం, లింగంపల్లి, మౌలాలి, ముషీరాబాద్, సఫిల్‌గూడ్, షేక్‌పేట్, బంజరా హిల్స్, పటాన్‌చెరు, చందానగర్, ఖైరతాబాద్, బోరబండ 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
ఇవి కూడా చదవండి
రామంతపూర్ గోకులే నగర్ ఘటనపై కేటీఆర్, కవిత దిగ్భ్రాంతి
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ.. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం..
Read Latest Telangana News And Telugu News