HYD Rain Alert: మరికొన్ని గంటల్లో భారీ వర్షం.. తస్మాత్ జాగ్రత్త
ABN , Publish Date - Aug 18 , 2025 | 10:04 AM
నిన్న కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్ని జలమయం అయ్యాయి. వాటర్ లాగిన్ పాయింట్స్‌లో వర్షపు నీరు నిలిచిపోయింది.
హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి భారీ వర్షం కురవనుంది. వరుణుడు మరోసారి నగర వాసులపై తన ప్రతాపం చూపాడానికి సిద్ధమైనట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రానున్న మరికొన్నిగంటల్లో నగరంలో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. మరో రెండు రోజులపాటు ఈ భారీ వర్షాలు కొనసాగుతాయని సూచించింది. జీహెచ్ఎంసీ పరిధీలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అయితే.. నిన్న కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్ని జలమయం అయ్యాయి. వాటర్ లాగిన్ పాయింట్స్‌లో వర్షపు నీరునిలిచిపోయింది. రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీరును జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అందరూ అప్రమత్తండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రభుత్వం పలు జిల్లాలకు అలర్టులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
కనకగిరి అడవుల్లో నీలిరంగు పుట్టగొడుగు