Kinnerasani: కిన్నెరసానికి భారీగా వరద..
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:39 PM
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు చేరుతోంది. శుక్రవారం 404.70 అడుగులకు నీటి మట్టం పెరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని పాకాల కొత్తగూడం నుంచి గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం అటవీ ప్రాంతాల నుంచి జలాశయానికి 1,700 క్యూసెక్కుల చొప్పున నీరు చేరడంతో డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు.
- 404.70 అడుగులకు చేరిక
- అప్రమత్తమైన అధికారులు
- లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ
పాల్వంచ(భద్రాద్రి కొత్తగూడెం): పాల్వంచ మండలంలోని కిన్నెరసాని(Kinnerasani) జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు చేరుతోంది. శుక్రవారం 404.70 అడుగులకు నీటి మట్టం పెరిగింది. మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలోని పాకాల కొత్తగూడం నుంచి గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం అటవీ ప్రాంతాల నుంచి జలాశయానికి 1,700 క్యూసెక్కుల చొప్పున నీరు చేరడంతో డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు.

డ్యాం సామర్థ్యం 407 అడుగులు కాగా 404.70 అడుగులకు నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. జలాశయం దిగువ ప్రాంతం లో ఉన్న లోతట్టు గ్రామాల ప్రజలు వాగులు దాటొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News