Hanumakonda: సౌదీలో కష్టాలు.. కన్నీళ్లు అనుభవించా
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:23 AM
సౌదీలో కష్టాలు.. కన్నీళ్లు అనుభవించా.. ఏడేళ్ల పాటు ఎడారి జీవితం నిత్య నరకంలా మారింది. డ్రైవర్ పనని ఖర్జూర తోటలో కూలీగా పెట్టారు.
మంత్రి పొన్నం చొరవతో ఇంటికి వచ్చా
ఏడేళ్లు ఎడారి జీవితం అనుభవించిన ఈశ్వర్ ఆవేదన
భీమదేవరపల్లి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ‘సౌదీలో కష్టాలు.. కన్నీళ్లు అనుభవించా.. ఏడేళ్ల పాటు ఎడారి జీవితం నిత్య నరకంలా మారింది. డ్రైవర్ పనని ఖర్జూర తోటలో కూలీగా పెట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో భారత్‌కు రాగలిగాను’ ఇది సౌదీలో నరకం అనుభవించిన హనుమకొండ జిల్లా వాసి తాళ్లపల్లి ఈశ్వర్ ఆవేదన. సౌదీ నుంచి ఆదివారం ఇంటికి చేరుకున్న ఆయన తన బాధను మీడియాతో వెళ్లబోసుకున్నారు.
భీమదేవరపల్లి మండలంలోని కొప్పూర్ గ్రామానికి చెందిన ఈశ్వర్ ఆర్థిక ఇబ్బందులతో ఏడేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ క్రమంలో వీసా, పాస్‌పోర్టు గడువు ముగియడంతో ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు.