Ramanthapur Issue: రామంతాపూర్ ప్రమాదానికి కారణం ఇంటర్నెట్ కేబుల్లా..? విద్యుత్ శాఖ నిర్లక్ష్యమా..?
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:55 PM
రామంతాపూర్ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ.. కాలనీ వాసులు రోడ్డెక్కారు. దీంతో రామంతపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. గోఖలే నగర్ విద్యుత్ షాక్ ఘటనపై స్థానికులు భగ్గుమన్నారు. రామంతపూర్ రోడ్డుపై బైఠాయించిన కాలనీ వాసులు నిరసన చేపట్టారు.
హైదరాబాద్: రామంతాపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన విషాదంపై విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆరా తీశారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 11 కేవీ విద్యుత్ తీగకి ఇంటర్నెట్ కేబుల్ కండక్టర్ వైర్ కాంటాక్ట్‌లో ఉందని తెలిపారు. దీంతో ఇంటర్నెట్ కేబుల్లో కూడా కరెంట్ పాస్ అవుతోందని పేర్కొన్నారు. ఆ ఇంటర్నెట్ కేబుల్ శోభాయాత్రలోని రథానికి తాకి.. రథం మొత్తం కరెంట్ సరఫరా అయ్యిందని చెప్పారు. ఈ ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. తక్షణ చర్యగా ఇక్కడ ఉన్న ఇంటర్నెట్ కేబుల్ వైర్లు అన్నీ తొలగించి.. కిందకు ఉన్న విద్యుత్ తీగలను సరిచేస్తామని చెప్పుకొచ్చారు. రానున్న వినాయక, దుర్గామాత నవ రాత్రుల సందర్భంగా.. నగర వ్యాప్తంగా అన్ని చోట్ల తీగలను సరిచేస్తామని ఆయన వెల్లడించారు.
కాగా, విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ.. కాలనీ వాసులు రోడ్డెక్కారు. దీంతో రామంతాపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. గోకులే నగర్ విద్యుత్ షాక్ ఘటనపై స్థానికులు భగ్గుమన్నారు. రామంతాపూర్ రోడ్డుపై బైఠాయించిన కాలనీ వాసులు నిరసన చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబాలకు యాభై లక్షల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన విద్యుత్ శాఖ అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. కాలనీ వాసులు ఆందోళనతో రామంతపూర్ - ఉప్పల్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఘనటలో గాయాపడిన నలుగరిలో ఒక వ్యక్తి మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గణేష్ అని వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీందో విద్యుత్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది.
ఇవి కూడా చదవండి..
డ్రమ్ములో పురుషుడి కుళ్లిన శవం.. ఫ్యామిలీ మిస్సింగ్..
చివరి నిమిషంలో విమానం రద్దు.. కారణం ఏంటంటే..