Share News

Air India Flight: చివరి నిమిషంలో విమానం రద్దు.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Aug 18 , 2025 | 06:59 AM

Air India Flight: మెయిన్‌టెనెన్స్ సమస్య కారణంగా ఎయిర్ ఇండియాకు చెందిన మిలన్ టు ఢిల్లీ విమానం రద్దయింది. ఎయిర్ ఇండియా అధికారులు ప్రయాణం మొదలవ్వాల్సిన చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Air India Flight: చివరి నిమిషంలో విమానం రద్దు.. కారణం ఏంటంటే..
Air India Flight

గత కొన్ని నెలల నుంచి ఎయిర్ ఇండియా తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంది. సాంకేతిక లోపాలు, ఇతర సమస్యల కారణంగా విమాన ప్రయాణం ఆలస్యం అవ్వటం లేదా రద్దు కావటం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం బెంగళూరు నుంచి గ్వాలియర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ల్యాండింగ్ సమస్య తలెత్తింది. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వలేకపోయింది. మొదటి ప్రయత్నంలో విమానం ల్యాండ్ అవ్వలేకపోవటంతో పైలట్లు విమానాన్ని గాల్లోకి లేపారు.


కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత మరో సారి ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. రెండవ ప్రయత్నంలో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. మెయిన్‌టెనెన్స్ సమస్య కారణంగా ఎయిర్ ఇండియాకు చెందిన మిలన్ టు ఢిల్లీ విమానం రద్దయింది. ఎయిర్ ఇండియా అధికారులు ప్రయాణం మొదలవ్వాల్సిన చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఆగస్టు 16వ తేదీన ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో .. ‘ఏఐ138 విమానం ఆగస్టు 16వ తేదీన మిలన్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. ప్రయాణం మొదలయ్యే చివరి నిమిషంలో విమానం క్యాన్సిల్ అయింది. పుష్ బ్యాక్ సమయంలో మెయిన్‌టెనెన్స్ సమస్య బయటపడింది. అందుకే విమానం క్యాన్సిల్ అయింది. మా సిబ్బంది ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.


వారికి హోటల్‌‌లలో బస ఏర్పాటు చేశారు. డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేశారు. వేరే విమానంలో వారి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేశారు’ అని పేర్కొంది. కాగా, ఈ మధ్య కాలంలో చివరి నిమిషంలో విమానాలు రద్దవటం తరచుగా జరుగుతోంది. ఆగస్టు 3వ తేదీన భువనేశ్వర్ నుంచి ఢిల్లీ బయలుదేరాల్సిన విమానం చివరి నిమిషంలో రద్దయింది. క్యాబిన్‌లో హై టెంపరేచర్ ఉందన్న కారణంతో విమానం రద్దయింది.


ఇవి కూడా చదవండి

మావోయిస్టు అరెస్టు.. ఆయుధాలు స్వాధీనం

రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే

Updated Date - Aug 18 , 2025 | 07:04 AM