Gold and Silver Prices: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే
ABN , Publish Date - Aug 18 , 2025 | 06:34 AM
మార్కెట్‌లో అనిశ్చితి సందర్భంగా దేశంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష రూపాయలను దాటి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నేటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అయినప్పటికీ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర లక్ష రూపాయలకుపైగా (gold and silver price drop August 18th 2025) ఉంది. ఈ క్రమంలో ఆగస్ట్ 18, 2025న ఉదయం 6.30 గంటల నాటికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,01,170కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,740 స్థాయిలో ఉంది.
నిన్నటి ధరలతో పోలిస్తే బంగారం ధరలు స్వల్పంగా రూ. 10 తగ్గాయి. అదే సమయంలో వెండి ధర కిలోకు రూ.100 తగ్గి, రూ. 1,16,100 వద్ద ఉంది. అయితే, ఇతర ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు
మరోవైపు హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,170గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 92,740గా ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,26,100గా నమోదైంది. ఇది ఢిల్లీలో (రూ. 1,16,100) కంటే అధికం. ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పాట్నాలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,170, 22 క్యారెట్ల బంగారం రూ. 92,940గా ఉంది. వెండి ధర రూ. 1,16,900 వద్ద ఉంది. ఈ ధరల వ్యత్యాసాలకు స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, డిమాండ్ వంటి అంశాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.
ధరల తగ్గుదలకు కారణాలు
బంగారం, వెండి ధరల తగ్గుదలకు అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం వల్ల బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది. డాలర్ బలంగా ఉన్నప్పుడు, బంగారం కొనుగోలు ఖర్చు ఎక్కువ అవుతుంది. దీనివల్ల డిమాండ్ తగ్గుతుంది. ఫలితంగా, బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. ఇటీవలి కాలంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల పెట్టుబడిదారులు తమ లాభాలను కాపాడుకోవడానికి బంగారం అమ్మకాలవైపు మొగ్గు చూపారు. ఈ అమ్మకాల ఒత్తిడి ధరల తగ్గుదలకు దారితీసింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి