Ghost Appears: ఇలాంటి నటుడ్ని చూసుండరు.. దెయ్యం పట్టినట్లు యాక్టింగ్ ఇరగదీశాడు..
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:51 PM
Ghost Appears: టీచర్ హోం వర్క్ గురించి అడగ్గానే పిల్లాడు దెయ్యం డ్రామా మొదలెట్టాడు. దెయ్యం పట్టినట్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించటం మొదలెట్టాడు. దీంతో అక్కడి టీచర్లు ఆశ్చర్యపోయారు.
‘ఎన్టీఆర్‌ను చూశాను.. ఏఎన్‌ఆర్‌ను చూశాను.. కానీ, నీలాంటి నటుడ్ని చూడలేదురా’ అని అపరిచితుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది. ప్రకాష్ రాజ్, విక్రమ్‌ను ఇంటరాగేట్ చేసే సీన్‌లో ఈ డైలాగ్ ఉంటుంది. తాజాగా, ఓ బాలుడు విక్రమ్‌ను తలదన్నేలా యాక్టింగ్ ఇరగదీశాడు. హోం వర్క్ గురించి అడినందుకు తనకు దెయ్యం పట్టిందంటూ ఊగిపోయాడు. అతడు చేసిన పనితో టీచర్లు పగలబడి నవ్వుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ బాలుడు కన్నడ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం క్లాస్ టీచర్ అతడ్ని హోం వర్క్ గురించి అడిగాడు. టీచర్ హోం వర్క్ గురించి అడగ్గానే పిల్లాడు దెయ్యం డ్రామా మొదలెట్టాడు. దెయ్యం పట్టినట్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించటం మొదలెట్టాడు. దీంతో అక్కడి టీచర్లు ఆశ్చర్యపోయారు. అతడి ప్రవర్తనకు పగలబడ నవ్వుకున్నారు. ఓ టీచర్ దీన్నంతా వీడియో తీశాడు.
ఆ వీడియో కాస్తా సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ ఐడియా మా చిన్నపుడు రాలేదు. వచ్చుంటే నేను కూడా యాక్టింగ్ ఇరగదీసేవాడ్ని. అనవసరంగా దెబ్బలు తిన్నాను’..‘సు ఫ్రమ్ సో పార్ట్ 2 చూస్తున్నట్లుంది’..‘ఆ బాలుడు నాకు బెస్ట్ ఫ్రెండ్‌గా కావాలి’..‘రాత్రి కాంతార సినిమా చూసినట్లు ఉన్నాడు. యాక్టింగ్ ఇరగదీస్తున్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. గాల్లో ఉండగా విమానంలో మంటలు..
మేకను మింగిన కొండచిలువు.. గ్రామస్తులు ఏం చేశారంటే..