Share News

AP News: అదిగో పులి.. ఇదిగో తోక...

ABN , Publish Date - Aug 16 , 2025 | 10:12 AM

అదిగో చిరుత, ఇదిగో చిరుతలు ఉన్నాయంటూ అలిరెడ్డిపల్లె, వేంపల్లె రైతులు భయాందోళన చెందుతున్నారు. వేంపల్లె మండల పరిధిలోని పాపాఘ్ని నది అవతలున్న అలిరెడ్డిపల్లె సమీపంలోని ఎద్దలకొండ వెనుకవైపున అలిరెడ్డిపల్లె, వేంపల్లెకు చెందిన రైతులకు పొలాలు ఉన్నాయి.

AP News: అదిగో పులి.. ఇదిగో తోక...

- భయంభయంగా అలిరెడ్డిపల్లె రైతులు

వేంపల్లె(కడప): అదిగో చిరుత, ఇదిగో చిరుతలు ఉన్నాయంటూ అలిరెడ్డిపల్లె, వేంపల్లె(Alireddypalle, Vempalle) రైతులు భయాందోళన చెందుతున్నారు. వేంపల్లె మండల పరిధిలోని పాపాఘ్ని నది అవతలున్న అలిరెడ్డిపల్లె సమీపంలోని ఎద్దలకొండ వెనుకవైపున అలిరెడ్డిపల్లె, వేంపల్లెకు చెందిన రైతులకు పొలాలు ఉన్నాయి. వెనుకాలే శేషాచల అడవులు(Sheshachala forests) ఉన్నాయి.


కొద్దిరోజులుగా దూరంగా చిరుత(Leopard)లు కనిపిస్తున్నాయన్న అనుమానం రైతులకు ఉంది. గురువారం రాత్రి దూరంగా రెండు చిరుతలు కనిపించాయంటూ పలువురు భయానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ బాలసుబ్రహ్మణ్యం, డీఆర్‌ఓ వెంకట సుబ్బయ్య దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే డీఆర్‌ఓ వెంక టసుబ్బయ్య ఆధ్వర్యంలో శుక్రవారం శేషాచల అడవులలోని చుట్టుప క్కల గాలించారు.


knl1.2.jpg

అక్కడున్న కాలిగుర్తులు బట్టి అవి చిరుతలు కావని, ఇతర జంతువులు ఉంటాయని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో చిరుతలు లేవని.. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని రేంజర్‌ తెలిపారు. కొత్త జంతువులు ఏవైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

త్వరలో ఖనిజ రంగంలోకి సింగరేణి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2025 | 10:12 AM