Share News

Polavaram : వరద పోటుకు దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్‌ ఎగువ కాఫర్ డ్యాం సీపేజ్

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:10 AM

గత పది రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్ట్‌కు వరదనీరు పోటెత్తింది. దీంతో ఎగువ కాఫర్ డ్యాంలో కొంత భాగం పాడైనట్టు తెలుస్తోంది. 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతున సీపేజ్ దెబ్బతిన్నట్టు చెబుతున్నారు.

Polavaram : వరద పోటుకు దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్‌ ఎగువ కాఫర్ డ్యాం సీపేజ్
Polavaram

పోలవరం, ఆగస్టు 16 : గత పది రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్ట్‌కు వరదనీరు పోటెత్తింది. దీంతో ఎగువ కాఫర్ డ్యాంలో కొంత భాగం పాడైనట్టు తెలుస్తోంది. 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతున కాఫర్ డ్యాంకు డ్యామేజ్ వాటిల్లినట్టు చెబుతున్నారు. ఇప్పటికే 2022 ఆగస్ట్ భారీ వరదలకు ఎగువ కాఫర్ డ్యాం సీపేజ్ కొంతమేర దెబ్బతింది.


దిగువన బట్రస్ డ్యాం నిర్మాణం, ఎగువన ఎత్తు, వెడల్పు పెంచిన చోటే ఇప్పుడు కొంతమేర నిర్మాణం దెబ్బతిన్నట్టు సమాచారం. అయితే, దీనివల్ల పెద్దగా నష్టం లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. దెబ్బతిన్న ప్రాంతంలో మరమ్మతులు కూడా పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. కాపర్ డ్యాం నుంచి సీపేజ్ కొనసాగుతుండడంతో.. ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేస్తూ డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలుస్తోంది.



ఈ వార్తలు కూడా చదవండి..

మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

త్వరలో ఖనిజ రంగంలోకి సింగరేణి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2025 | 01:18 PM