HYD Rain Alert: మరికాసేపట్లో భారీ వర్షం.. బయటకు రావొద్దన్న అధికారులు
ABN , Publish Date - Aug 16 , 2025 | 05:15 PM
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జనసంచారం స్థంభించిపోయింది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా.. అన్ని ఫ్లోటింగ్ సిటీలుగా మారిపోయాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి భారీ వర్షం కురవనుంది. వరుణుడు మరోసారి నగర వాసులపై కనికరం లేని ప్రతాపం చూపాడానికి సిద్ధమైనట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రానున్న 2-3 గంటల్లో నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పనులు ముగించుకుని త్వరగా ఇంటి ముఖం పట్టాలని సూచిస్తుంది.
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జనసంచారం స్థంభించిపోయింది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా.. అన్ని ఫ్లోటింగ్ సిటీలుగా మారిపోయాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై రాకపోకలు లేక రోడ్లన్ని వెలవెలబోతున్నాయి. అయితే.. తాజాగా భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2-3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, రంగారెడ్డి, జనగాం, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. అలాగే.. మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రయాణాలు ఉంటే.. రద్దు చేసుకోవాలని, లేకుంటే వాయిదా వేసుకోవాలని తెలుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కనకగిరి అడవుల్లో నీలిరంగు పుట్టగొడుగు