Minister Komatireddy Venkat Reddy: రోడ్ల డ్యామేజీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష..
ABN , Publish Date - Aug 16 , 2025 | 05:55 PM
భారీ వర్షాల కారణంగా 22 చోట్ల రోడ్లు తెగిపోతే వెంటనే 4 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేసినట్లు మంత్రి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. 171 చోట్లలో ఇంకా కాజ్ వే, కల్వర్టులు వద్ద వరద ప్రవాహం ఉన్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రోడ్ల డ్యామేజీపై అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. వరద ప్రవాహాలకు రాష్ట్ర వ్యాప్తంగా 454 చోట్ల ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. 629 కిలో మీటర్లు రోడ్డు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. రోడ్ల మరమ్మత్తులపై పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం వేసిన నాణ్యతా రహిత రోడ్ల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పాడ్డాయని ఆరోపించారు.
భారీ వర్షాల కారణంగా 22 చోట్ల రోడ్లు తెగిపోతే వెంటనే 4 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేసినట్లు మంత్రి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. 171 చోట్లలో ఇంకా కాజ్ వే, కల్వర్టులు వద్ద వరద ప్రవాహం ఉన్నట్లు పేర్కొన్నారు. 108 రాకపోకలకు ఇబ్బంది ఉన్న ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. 71 చోట్ల క్లియర్ చేయగా.. మిగతా చోట్ల సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. వాగుల వెంట 58 కి.మీ రోడ్డు కోతకు గురైందని, అందులో 378 మీటర్లు రోడ్డును ప్రభుత్వం మూసివేసిందని తెలిపారు. మొత్తంగా 147 చోట్లలో కాజ్ వే, మైనర్ బ్రిడ్జిలు, కల్వర్టులు తాత్కాలికంగా, శాశ్వతంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అవసరమైతే తప్ప రావొద్దని మంత్రి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కనకగిరి అడవుల్లో నీలిరంగు పుట్టగొడుగు