ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Israel-Iran War: ఇరాన్‌‌పై ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్.. ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో షాకింగ్ సీన్..

ABN, Publish Date - Jun 19 , 2025 | 04:25 PM

ఇరాన్‌లోని అనేక అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాషింగ్టన్‌కు చెందిన ఇరానియన్ మానవ హక్కుల సంస్థ ప్రకారం.. ఇజ్రాయెల్ జూన్ 13 నుంచి జరిపిన దాడుల్లో..

Israel-Iran War

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ ఉదృతమవుతోంది. రెండు దేశాలు తగ్గేదేలేదు అన్నట్లుగా మిసైల్లతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఇరాన్‌లోని అణ్వాయుధ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్‌లోని చాలా ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా, బయటివచ్చిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి.

ఇరాన్‌లోని (Israel-Iran War) అనేక అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు తెగబడుతోంది. వాషింగ్టన్‌కు చెందిన ఇరానియన్ మానవ హక్కుల సంస్థ ప్రకారం.. ఇజ్రాయెల్ జూన్ 13 నుంచి జరిపిన దాడుల్లో ఇరాన్‌లో మొత్తం 585 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే జూన్ 16వ తేదీ ఉదయానికి ఇజ్రాయెల్‌లో 24 మంది మరణించారని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. అయితే ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో (Air strikes) ఇరాన్‌లోని అనేక అణు, సైనిక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు (Satellite images) చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ధ్వంసమైన నాటాంజ్ అణు కేంద్రం..

ఇజ్రాయెల్ జూన్ 13న జరిపిన దాడుల్లో.. ఇరాన్‌లో అతి పెద్దదైన నటాంజ్ అణు కేంద్రం చాలా వరకూ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి ఈ అణు కేంద్రం గుండెకాయ వంటిదని చెబుతుంటారు. ఇజ్రాయెల్ దాడుల తర్వాత శాటిలైట్ చిత్రాలను పరిశీలించగా చాలా నష్టం సంభవించినట్లు కనిపిస్తోంది. నష్టం ఏ మేరకు జరిగిందనే పూర్తి వివరాలు లేకున్నా కూడా.. ఈ దాడుల్లో విద్యుత్ సరఫరా, అత్యవసర బ్యాకప్ వ్యవస్థలు, సబ్‌స్టేషన్‌తో సహా అనేక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్..

చైనా సహకారంతో ఇరాన్‌లో ఇస్ఫహాన్ అణు కేంద్రాన్ని 1984లో నిర్మించారు. తాజాగా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఈ అణు కేంద్రంలోని అనేక భవనాలు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. ఈ కేంద్రం కూడా ఇరాన్‌లోని అతి పెద్ద అణు పరిశోధన కేంద్రాల్లో ఒకటి అని తెలుస్తోంది. ఇక్కడ ఇరాన్ ప్రభుత్వం 3,000 మంది శాస్త్రవేత్తలను నియమించినట్లు సమాచారం. శుక్రవారం జరిగిన దాడిలో ఈ అణు కేంద్రంలోని కేంద్ర రసాయన ప్రయోగశాల, యురేనియం మార్పిడి కర్మాగారం తదితర నాలుగు భవనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

టాబ్రిజ్ క్షిపణి స్థావరం..

ఇరాన్‌లోని తబ్రిజ్‌కు ఉత్తరాన ఉన్న క్షిపణి స్థావరంలో కూడా చాలా నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో చాలా భవనాలు, వాహనాలు, వృక్షాలు దెబ్బతిన్నట్లు శాటిలైట్ ఛాయా చిత్రాల్లో కనిపిస్తోంది.

ఖోజిర్ మిలిటరీ బేస్..

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్‌లోని పార్చిన్‌కు ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోజిర్ మిలిటరీ బేస్ తీవ్రంగా దెబ్బతింది. ఈ కాంప్లెక్స్‌లో కొన్ని భవనాలు ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది.

వీటితో పాటూ ఇంకా అనేక ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం సంభవించినట్లు తెలిసింది. శనివారం ఉదయం జరిపిన వైమానిక దాడుల్లో అబాదాన్ చమురు శుద్ధి కర్మాగారం దెబ్బతిననట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అలాగే ఖుజెస్తాన్‌ ప్రావిన్స్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు ఇరాన్ అధికారులు శనివారం ధ్రువీకరించారు.

ఇవీ చదవండి:

ఇరాన్‌పై దాడికి అమెరికా రెడీనా.. తేదీ ఖరారైనట్టేనా

36 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. యోచనలో అమెరికా

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 19 , 2025 | 04:34 PM