Russia Warns America: అగ్రరాజ్యం అమెరికాకు రష్యా హెచ్చరిక
ABN, Publish Date - Oct 23 , 2025 | 05:10 PM
అమెరికాకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. రష్యా్కు చెందిన పెద్ద చమురు కంపెనీలపై ఆంక్షలు.. అమెరికాకే నష్టం కలిగిస్తాయని మారియా జఖారోవా తేల్చి చెప్పారు. ఆంక్షలతో రష్యా వెనక్కి తగ్గదని కూడా ఆమె తేల్చేశారు.
ఢిల్లీ, అక్టోబర్ 23: అగ్రరాజ్యం అమెరికాకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. రష్యాకు చెందిన పెద్ద చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడంపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జఖారోవా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆంక్షలు అమెరికాకే నష్టం కలిగిస్తాయని మారియా జఖారోవా తేల్చి చెప్పారు.
అమెరికా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని కూడా మారియా జఖారోవా స్పష్టం చేశారు. ఈ ఆంక్షల ప్రభావం మాస్కోపై కంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే ఎక్కువగా పడుతుందని ఆమె తెలిపారు. ఇంధన ధరలు పెరుగుతాయి, సరఫరా వ్యవస్థ దెబ్బతింటుంది.. చివరికి అందరికీ నష్టం జరుగుతుందని మారియా జఖారోవా అన్నారు.
అమెరికా ఆంక్షలతో రష్యా వెనక్కి తగ్గదని కూడా మారియా జఖారోవా తేల్చేశారు. అమెరికాతో రష్యా చర్చలకు సిద్ధమే కానీ.. అవి మీడియాలో మాటల యుద్ధంగా కాకుండా, నిజమైన రాజనీతి చర్చలుగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి
చీకటి నింపిన దీపావళి.. 125 మంది కళ్ళకు గాయాలు.. ఏమైందంటే?
మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనా?
Updated Date - Oct 23 , 2025 | 06:38 PM