Lethal calcium carbide gun 2025: చీకటి నింపిన దీపావళి.. 125 మంది కళ్ళకు గాయాలు.. ఏమైందంటే?
ABN , Publish Date - Oct 23 , 2025 | 02:03 PM
కేవలం రూ. 150-200 ఖర్చుతో తయారయ్యే కాల్షియం కార్బైడ్ తుపాకీ( Lethal Calcium carbide gun), పిల్లల జీవితాల్లో అంధకారం సృష్టించింది. కళ్ళకు గాయాలు కావడంతో పిల్లలందరిని ఆసుపత్రులకు తరలించారు.
భోపాల్, అక్టోబర్ 23: జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి పండుగ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్(Bhopal) నగరంలోని కొన్ని కుటుంబాల్లో చీకటిని నింపింది. నేటి రోజుల్లో దీపావళి(Diwali) రోజు బాణాసంచా కాల్చడం పతాక స్థాయికి చేరింది. కొత్త కొత్త బాణాసంచా వీధుల్లో అందుబాటులోకి రావడంతో పిల్లలతో సహా పెద్దలు కూడా వాటిని కొనుగోలు చేసి కాల్చుతున్నారు. తాజాగా బాణాసంచా కాలుస్తుండగా అనుకోని ఘటన జరిగింది. తుపాకీ ఆకారంలోనే ఉండే బాణాసంచాను పిల్లలు పేలుస్తుండగా.. అందులోని విషపు రసాయనాలు పిల్లల కంటిపై పడి తీవ్ర ప్రభావం చూపింది.
గన్ కాల్చేటప్పుడు.. గొట్టంలో పెట్టి గురి చూసి కాల్చుతారు. అలాగే చిన్నపిల్లలు కూడా కాల్చుతుండగా రసాయనాలు పేలి కళ్లపై పడ్డాయి . కేవలం రూ. 150-200 ఖర్చుతో తయారయ్యే కాల్షియం కార్బైడ్ తుపాకీ( Lethal Calcium carbide gun), పిల్లల జీవితాల్లో అంధకారం సృష్టించింది. కళ్ళకు గాయాలు కావడంతో పిల్లలందరిని ఆసుపత్రులకు తరలించారు. అయితే కొందరు పెద్దలు కూడా ఈ తుపాకిని పేల్చి తమ ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. ఆసుపత్రులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 125 మందికి పైగా ఈ పేలుడు బారిన పడ్డారు.
ఈ గ్యాస్ లైటర్, ప్లాస్టిక్ పైపు, సులభంగా దొరికే కాల్షియం కార్బైడ్‌తో ఈ బొమ్మ తుపాకిని తయారు చేస్తారు. పైపులో ఉన్న కార్బైడ్ నీటితో కలిసినప్పుడు ఆసిటైలిన్ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో చిన్న చిమ్మటి చిమ్మరుతో భారీ పేలుడు సంభవిస్తుంది. పైపు పగిలిపోతే ప్లాస్టిక్ ముక్కలు కళ్లలోకి, ముఖంపైకి దూసుకెళ్లి తీవ్రమైన గాయాలు కలిగిస్తాయి. చాలా సార్లు పిల్లలు ఆసక్తిగా పైపులోకి చూడగానే పేలుడు జరిగి కళ్లకు, ముఖానికి, కార్నియాకు గాయాలయ్యాయి. భోపాల్ ఆసుపత్రుల నివేదికల ప్రకారం, వందకు పైగా బాధితుల్లో 20-30 శాతం మందికి తీవ్రమైన డ్యామేజ్ అయిందని పేర్కొంది. కొందరికి వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని.. కొంతమందికి కార్నియా ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Tejashwi Yadav: డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో రాష్ట్రంలో అవినీతి: తేజస్వి యాదవ్
MNM leader Snehan: అసెంబ్లీ ఎన్నికలు.. భీకర యుద్ధమే