Russia missile test: బ్యూరెవెస్టినిక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతం.. రష్యా అధ్యక్షుడి ప్రకటన..
ABN, Publish Date - Oct 26 , 2025 | 04:32 PM
ప్రత్యేకమైన అణుశక్తితో నడిచే 'బ్యూరెవెస్టినిక్' క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం ప్రకటించారు. ఈ క్షపణి పరిధి చాలా ఎక్కువగా ఉండడం విశేషం.
ప్రత్యేకమైన అణుశక్తితో నడిచే 'బ్యూరెవెస్టినిక్' క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం ప్రకటించారు. ఈ క్షిపణి పరిధి చాలా ఎక్కువగా ఉండడం విశేషం. ఈ క్షిపణి ఏకధాటిగా 14,000 కి.మీ. ప్రయాణించిందని, 15 గంటల పాటు గాల్లోనే ఉందని పుతిన్ ప్రకటించారు. ఈ క్షిపణి మోహరింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని ఆయన సాయుధ దళాలకు సూచించారు (nuclear-powered missile).
పుతిన్ ఆదివారం ఉదయం చీఫ్ జనరల్ వాలెరీ గెరాసిమోవ్ నేతృత్వంలోని దళాల కమాండర్లతో సంభాషించారు (Russian military news). 10,000 కంటే ఎక్కువ మంది ఉక్రెయిన్ సైనికులను రెండు ముఖ్యమైన దిశలలో చుట్టుముట్టడం గురించి పుతిన్‌కు గెరాసిమోవ్ ఈ సందర్భంగా వివరించారు. 31 బెటాలియన్లతో కూడిన ఉక్రెయిన్ సాయుధ దళాలలోని పెద్ద సమూహాన్ని రష్యా సైనికులు అడ్డుకున్నారని గెరాసిమోవ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
కెనడాపై అదనపు సుంకం.. భారీ షాకిచ్చిన ట్రంప్
పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 26 , 2025 | 09:06 PM